ఆంధ్రప్రదేశ్‌

రెండున్నరేళ్లలో 52వేల ఉత్తర్వులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్ల కాలంలో ఇప్పటికి రికార్డుస్థాయిలో 52 వేల 500 జీవోలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహిస్తున్న శాఖల అధిపతులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇప్పటివరకూ రాష్ట్ర పాలనకు 52 వేల 500 జీవోలు ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టాలన్నా, అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా, విధానపరమైన నిర్ణయమైనా, అధికారులను నియమించాలన్నా, మార్పు చేయాలన్నా, పద్నోన్నతి ఇవ్వాలన్నా, తొలగించాలన్నా.. ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా... ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే అంటే జీవోల ద్వారానే నిర్ణయం జరుగుతుంది. 2014 జూన్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2016 వరకు విడుదల చేసిన జీవో విషయాలను ఒకసారి పరిశీలిస్తే జీవోఎంఎస్ ప్రకారం మొత్తం 6922 జీవోలు విడుదలయ్యాయి. జీవోఆర్‌టి ప్రకారం 44213 జీవోలు విడుదలయ్యాయి. నిధులు ఖర్చు చేయాలన్నా... జమ చేయాలన్న లెక్కపద్దుల మేరకే నిర్ణయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రెవిన్యూ శాఖ కీలక ఆదాయ వనరు, రెవిన్యూశాఖలో జీవోఎంఎస్ ప్రకారం 1111, జీవోఆర్టీ ప్రకారం 2889 జీవోలు విడుదలయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ ఇంటర్ ప్రన్యూర్ పిష్ అండ్ ఇన్నోవేషన్ శాఖకు సంబంధించి జీవోఎంఎస్‌లు 11 విడుదల కాగా, జీవో ఆర్‌టిలు 130 విడుదలయ్యాయి. విపత్తుశాఖకు సంబంధించిన 35 జివో ఎంఎస్‌లు, 500 జీవో ఆర్‌టిలు విడుదలయ్యాయి.
వ్యవసాయం, సహకార శాఖకు సంబంధించి 184 జివోఎం.ఎస్‌లు, 1942 జీవో ఆర్‌టిలు విడుదలయ్యాయి. ఆర్థికశాఖకు సంబంధించి 490 జీవో ఎంఎస్‌లు, 5247 జీవో ఆర్‌టిలు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించి 228 జీవో ఎంఎస్‌లు, 2549 జీవో ఆర్‌టిలు విడుదలయ్యాయి.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఐదు సంతకాలు చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, చేనేత కార్మికుల రుణమాఫీ, రూ.200 పింఛన్‌ను రూ.1000, రూ.1500కు పెంచారు. ఉద్యోగాల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిపైనా, బెల్టుషాపుల రద్దుపైనా చేశారు. వీటన్నింటికీ ఆయా శాఖ ద్వారా జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. లోటు బడ్జెట్‌తో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న సర్కారు ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగులకు మేలు చేకూర్చే అనేక జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. పీఆర్సీ కోసం ప్రభుత్వం పలు జీవోలను విడుదల చేసింది. ఉద్యోగులకు అమరావతిలో ఐదు రోజుల పని దినాలకు సంబంధించి సైతం జీవో విడుదల చేశారు.
రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సిఆర్డీఎ, నిర్మాణ సంస్థలకు రైతుల భూసేకరణ, వారికి పట్టాల కేటాయింపు, ఉద్యోగాల కల్పన ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలకు జీవోలను విడుదల చేయడం జరిగింది.