ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులకు పదివేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులకు ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల రూపాయల మేరకు నగదు చెల్లించనున్నారు. నగదు లేకుండానే రేషన్ సరకులను తీసుకువేళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగదురహిత చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బ్యాంకర్లతో బుధవారం పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యలపై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్టస్థ్రాయి కమిటీకి చైర్మన్‌గా సిఎం వ్యవహరిస్తారు. జిల్లాస్థాయి కమిటీలకు చైర్‌పర్సన్‌లుగా ఇంచార్జి మంత్రులు వ్యవహరిస్తారు. నగదు రహిత చెల్లింపులను 20 శాతానికి చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నెలరోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ఈ కమిటీలు పని చేయాలన్నారు. దేశంలోనే మోడల్ డిజిటల్ వ్యవస్థను తీసుకువస్తున్నామని, కైజాలా యాప్ ద్వారా ప్రభుత్వ శాఖలన్నీంటినీ సమీకృతం చేసి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో పెద్దనోట్ల రద్దు సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్‌ల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.10 వేల నగదు చెల్లంచేలా ఏర్పాటు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఇందుకు బ్యాంకర్లు అంగీకరించారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అవసరమైతే ఇ-పాస్ యంత్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మండలానికి ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో నగదు రద్దు పరిణామాలను పరిశీలించి నివేదిక అందచేయాలన్నారు. త్వరలోనే మరో 12935 ఇ-పాస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని బ్యాంకర్లు సిఎంకు తెలిపారు. ఆన్‌లైన్ లావాదేవీలకు పూర్తి భద్రత కల్పించేందుకు కమిటీలు సమర్థంగా పనిచేయాలన్నారు. 20రోజుల్లో నోట్ల రద్దు తరువాత తలెత్తిన పరిణామాలను సమర్ధవంతంగా సిఎం ఎదుర్కొన్నారని, ఇందుకు ఆయన అనుసరించిన విధానాలు దేశానికే ఆదర్శమని బ్యాంకర్లు కితాబిచ్చారు.