ఆంధ్రప్రదేశ్‌

భవిష్యత్ ఉద్యమంపై కార్యాచరణ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, నవంబర్ 30: కాపు ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి డిసెంబర్ 2న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 13 జిల్లాల కాపు నేతల సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు ఉద్యమాన్ని అణచేందుకు ప్రయత్నిన్నారని ఆరోపించారు. నాయకులు ఉద్యమంలో పాల్గొనకుండా గృహ నిర్బంధం చేయడం అమానుషమన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ఉద్యమం ఆగదన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో కాపులను నమ్మించి గద్దెనెక్కి, వారిని వంచించారన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై తాను గతంలో ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు. ఈ విషయం ముందుగా నల్ల కుబేరులకు తెలియడంతో వారు జాగ్రత్తపడ్డారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. సమావేశంలో కాపు నాయకులు ఆకుల రామకృష్ణ, ఆర్వీ సుబ్బారావు, బి నూకాపతి, టిఎస్‌ఎన్ మూర్తి, మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

23నుంచి విజయవాడలో..
అంతర్జాతీయ నాట్య సమ్మేళనం
అతిరథ మహారథులతో నాట్య ప్రదర్శనలు
విదేశాల నుంచీ తరలిరానున్న కళాకారులు
కూచిపూడి, నవంబర్ 30: అతిరథ మహారథులైన కూచిపూడి నాట్యాచార్యుల శిష్య ప్రశిష్యులతో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళన ప్రదర్శనలు భారీగా నిర్వహించనున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ కూచిపూడి నాట్యాచార్యుల అవిరళ కృషి ఫలితంగా విశ్వవ్యాప్తమైన ఈ నాట్యకళ కేవలం కళాలోకానికే పరిచయమైందన్నారు. ఈ నాట్యాన్ని సిలికానాంధ్ర సారథ్యంలో 2008 నుండి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాల ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను అధిగమిస్తోందన్నారు. డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో విజయవాడలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం ఆవరణలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముగింపు రోజు 25న ఆదివారం ఎస్‌వి భుజంగరాయశర్మ రచించగా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం నృత్య కల్పన చేసిన ‘జయముజయము లలిత కళావాణి’ అనే అంశాన్ని రాగమాలిక రాగం, ఆదితాళంలో వెంపటి చినసత్యం రెండో కుమారుడు రవిశంకర్ నట్టవాంగంలో 600 మంది కళాకారులు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపారు. తరువాత డాక్టర్ సి నారాయణరెడ్డి రచించగా వెంపటి చినసత్యం నృత్య కల్పన చేసిన ‘ఆనంద తాండవమాయే..’ అనే అంశాన్ని రాగమాలిక రాగం, ఆదితాళంలో ప్రదర్శిస్తారన్నారు. ఈ సందర్భంగా దివంగత నాట్యాచారిణి డాక్టర్ ఉమారామారావు స్మృత్యర్థం ప్రముఖ కూచిపూడి నాట్యాచారిణి అలేఖ్య పుంజాల బృందం, పివిజి కృష్ణశర్మ స్మృత్యర్థం ఆయన కుమారులు శ్రీనివాసులు, శేషుబాబు, విఠల్ కూచిపూడి నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. అభినయపూర్వక ప్రసంగాలు, తదితర అంశాలు కూడా ఉంటాయన్నారు. ఇంతవరకు 722 దరఖాస్తులు అందాయని ఆయన తెలిపారు. ఈ నాట్యోత్సవాలకు అమెరికా, ఉక్రెయిన్, కెనడా, సింగపూర్, దుబాయ్, ఇంగ్లాండ్, హాంకాంగ్, కువైట్ దేశాల నుండి కూచిపూడి కళాకారులు తరలి వస్తున్నట్లు కూచిభొట్ల ఆనంద్ వివరించారు.
మావోయిస్టుల లొంగుబాటు
సీలేరు,నవంబర్ 30: మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతి పరులు 113 మంది బుధవారం ఉదయం మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఎదుట లొంగిపోయారు.
మల్కన్‌గిరి జిల్లా పరిధిలో గల మావోయిస్టు మిలీషియా సభ్యులు గత కొన్నాళ్ళుగా మావోయిస్టులకు సహకరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వారి గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో స్వచ్ఛందంగా లొంగిపోతే గ్రామాలను అభివృద్ధి చెందుతాయని ఆలోచనకు వచ్చి ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులకు పునరావాసం కల్పిస్తామని, వారి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పాఠశాలలు, విద్యుత్, రోడ్లు, మంచినీరు తదితర వౌలిక సదుపయాలు కల్పిస్తామన్నారు.