ఆంధ్రప్రదేశ్‌

అఫిడవిట్ సమర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో చెరువుల నుంచి ఇష్టం వచ్చినట్లు పూడికను వెలికి తీసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గుంటూరు నగరంలోని పోతూరు చెరువు నుంచి పూడికను తీసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన అభియోగాలపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ఈ అంశంపై గుంటూరుకు చెందిన ఎ వెంకటసుబ్బయ్య మరో 9 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. స్థానిక టిడిపి నేతల మద్దతుతో అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసులో అభియోగాలు వచ్చిన స్థానిక టిడిపి నేత చిగురుపాటి సజ్జన రావుకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
ఆర్టీసి ఉద్యోగుల వయోపరిమితి పెంచండి
హైదరాబాద్, డిసెంబర్ 1: ఈ నెల 5వ తేదీన ఆర్టీసి హౌస్‌లో జరగనున్న ఆర్టీసి బోర్డు మీటింగ్‌లో ఆర్టీసి సిబ్బంది వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కోరారు.