ఆంధ్రప్రదేశ్‌

బంగారంపై ఆంక్షలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 1: ‘సార్ కేంద్రం బంగారంపై ఆంక్షలు పెడితే ఆడవాళ్లు ఊరుకోరు. మీరు ఇప్పుడు సంక్షోభ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. మీరు ప్రధానికి ఫోన్ చేసి అలాంటి ఆంక్షలు వద్దని చెప్పండి. మహిళల మనోభావాలు దెబ్బతింటే రాజకీయంగా మనమూ నష్టపోతామ’ని పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సూచించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం, దానికి ముందు జరిగిన తెదేపా సమన్వయ కమిటీ సమావేశాల్లో బాబు పార్టీ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో నెలకొన్న చిన్ననోట్ల సంక్షోభం, గాడితప్పిన ఆర్థికరంగాన్ని మళ్లీ క్రమబద్దీకరించేందుకు కేంద్రం వేసిన సబ్ కమిటీకి చంద్రబాబును చైర్మన్‌గా నియమించడంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇది మీ సమర్థత, ఆర్ధికరంగంపై మీకున్న అనుభవం, అవగాహనకు దక్కిన గుర్తింపు, గౌరవమని మంత్రులు అభినందించారు.
అదే సమయంలో కేంద్రం బంగారంపై ఆంక్షలు విధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పలువురు మంత్రులు బాబుకు సూచించారు. మహిళలకు సంబంధించిన అంశం కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు. దానికి స్పందించిన బాబు తాను దానిపై మోదీపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయం మనకు కలసివచ్చిందని బాబు వ్యాఖ్యానించారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే పెద్దనోట్లు రద్దు చేశారని గుర్తు చేశారు.
కాగా, మంత్రులు- ఎమ్మెల్యేలకు ఇప్పటి తరంలో గ్యాప్ బాగా ఉందని దాన్ని సరిదిద్దుకోవాల్సిన ఉందని చంద్రబాబు హెచ్చరించారు. జనచైతన్యయాత్రల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు, విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు బాగా పనిచేశారని అభినందించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు మన పనితీరుకు నిదర్శనమని, వాటిని సవాల్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ‘మనం మూడు ప్రధాన స్కీములు పెట్టాం. రుణమాఫీపై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. అయినా మనం దానిని జనాలకు చేర్చలేకపోతున్నాం. దళితులకు 10 రూపాయలకే ఎల్‌ఈడీ బల్బు ఇస్తున్నా అది ఆ వర్గాల్లో ప్రచారం కావడం లేదు. ఎట్టి పరిస్థితిలో మనం మునిసిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలవాలి’ అన్నారు. దానికోసం మంత్రి నారాయణతో మంత్రుల కమిటీ నియమిస్తున్నట్లు ప్రకటించారు. పెద్దనోట్లతో రాష్ట్రానికి 800 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈనెల్లో మరో 1500 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో మనం రంగంలోకి దిగి, ప్రజల పక్షాన నిలిచి కేంద్రం, ఆర్‌బిఐ, బ్యాంకర్లపై నిత్యం సమీక్షలు నిర్వహించడం వల్ల మిగిలిన రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే త్వరగా డబ్బులు విడుదల అవుతున్నాయని, అదే మనం కూడా మిగిలిన వారి మాదిరిగా వౌనంగా ఉంటే అది సాధ్యమయ్యేది కాదన్నారు.
నేతలపైనే వ్యతిరేకత వస్తోంది!
అంతకుముందు జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన బాబు పార్టీ నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా పార్టీ నేతలపైనే జనంలో అసంతృప్తి ఉన్నట్లు నా సర్వేల్లో తేలింది. ఎవరైనా 80 శాతం సంతృప్తికర ఫలితాలు తెచ్చుకోకపోతే మళ్లీ వారికి అవకాశాలు ఇచ్చేది లేదు. మనం చాలా మంచి పనులు చేస్తున్నాం. అన్ని వర్గాల వారికీ అనేక మేలు జరుగుతున్నా వాటి గురించి ప్రజలకు చెప్పడంలో నేతలు విఫలమవుతున్నారు. అలాంటి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని విడిచిపెట్టేస్తా. మీరంతా ప్రభుత్వ పథకాలపై ఉద్యమస్ఫూర్తితో పనిచేసినప్పుడే మళ్లీ మనం అధికారంలోకి వస్తామ’ని బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి ‘మీరు మరింత బాగా పనిచేయాల’ని బాబు సూచించారు. దానికి గంటా ‘సార్...ఇవాళ నా పుట్టినరోజు..దయచేసి ఏమీ అనకండి..విష్ చేయండి’ అనడం విశేషం. ఈసారి సభ్యత్వ నమోదు నత్తనడకన సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో 4 లక్షలు, ఏపిలో 44 లక్షలే ఇప్పటివరకూ సభ్యత్వం కావడంపై కారణం అడగగా, సభ్యత్వాలపై పెద్దనోట్ల ప్రభావం పడిందని పార్టీ నేతలు చెప్పారు. దానితో మరో 15 రోజులు గడువు పెంచుతున్నట్లు ప్రకటించారు.

మోదీ, ఉర్జిత్‌పై గృహహింస చట్టం కింద
కేసు నమోదు చేయాలి
సిపిఐ నేత నారాయణ డిమాండ్

ఒంగోలు, డిసెంబర్ 1: నోట్ల రద్దుతో దేశంలో అల్లకల్లోలం సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయాలని సిపిఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఒంగోలులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పాతనోట్లు చెల్లవని ప్రధాని, ఆర్‌బిఐ గవర్నర్‌లు ప్రకటించటంతో గృహిణులు తమ భర్తలకు తెలియకుండా కుటుంబ అవసరాల కోసం దాచుకున్న కొద్దిమొత్తం నగదు సైతం చెల్లకుండా చేయడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మోదీ విదేశాల్లో సంపన్నవర్గాలు అక్రమంగా దాచుకున్న అవినీతి నగదును తీసుకువస్తానని చెప్పారని, అయితే అవినీతి నగదును తీసుకురాకపోగా దేశంలో నోట్లను రద్దు చేసి అన్ని వర్గాల సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు.