ఆంధ్రప్రదేశ్‌

‘అనంత’ ఘటనకు సారీ: డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 1: గుంటూరు బ్యాంకు క్యూలైన్లలో నగదు కోసం నిరీక్షిస్తున్న సామాన్యులపై పోలీసుల దాడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఖండించారు. అనంతపురం ఘటనపై పోలీసుశాఖ తరఫున ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు. గుంటూరులోని నగరం పాలెం, పాత గుంటూరు పోలీస్టేషన్లను ఆదర్శ పోలీస్టేషన్లుగా నిర్మిస్తూ జరుగుతున్న పనులను గురువారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా డిజిపి విలేఖరులతో మాట్లాడుతూ సుమారు 60 రోజుల గడువులోనే గుంటూరు జిల్లాలోని నగరంపాలెం, అదేవిధంగా పాత గుంటూరు పోలీస్టేషన్లను ఆదర్శ పోలీస్టేషన్లుగా తీర్చి దిద్దుతున్నట్లు చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో ఈరెండు పోలీస్టేషన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక ముఖ్యమంత్రి అనుమతితో రాష్ట్రంలోని 100 ఆదర్శ పోలీస్టేషన్లను నిర్మించాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఈ పోలీస్టేషన్లలో మంచి ప్రవర్తన కలిగి మర్యాదపూర్వకంగా నడుచుకునే సిబ్బందిని ఇక్కడ నియమిస్తామన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత డిజిపిల సమావేశంలో మాట్లాడిన ప్రధానమంత్రి స్మార్ట్ పోలీసింగ్‌ను ఆచరణలో పెట్టేందుకు కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు. ఆదర్శ పోలీస్టేషన్లలో మంచి వాతావరణంతో పాటు మంచి సేవాభావాన్ని కూడా కలుగచేయాలన్నదే ముఖ్యమంత్రి అభిమతమని గుర్తు చేశారు. ఇదిలావుండగా గుంటూరులోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన శాఖను సందర్శించి పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో అక్కడబ్యాంకు ఏర్పాటు చేసిన ఏటిఎంల వద్ద ఖాతాదారులతో సంభాషించి వారి కష్టనష్టాల గూర్చి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో ఖాతాదారులకు మంచినీరు సరఫరా చేసి, వృద్ధులకు అసౌకర్యం కలుగకుండా స్వచ్చంద సంస్ధల సహకారం తీసుకోవాలని డిజిపి సూచించారు. ఎక్కువ మొత్తంలో బ్యాంకు నుంచి నగదు పొందలేని కారణంగా, పొలంలో పని చేసే వారికి రోజుకూలీ ఇవ్వలేని పరిస్ధితి ఉందని ఒక రైతు తన ఇబ్బందిని డిజిపికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐజిలు హరీష్‌కుమార్ గుప్తా, ఎన్ సంజయ్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రాజేంద్రనాధ్‌రెడ్డి గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట తిపాఠి పాల్గొన్నారు.

చిత్రం..గుంటూరులో డబ్బుల కోసం ఒక ఎటిఎం వద్ద బారులు తీరిన ప్రజలతో ముచ్చటిస్తున్న డిజిపి సాంబశివరావు