ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లలో బాబు పాలన ఖతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 1: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎల్లకాలం సాగదని, ఆయన ప్రభుత్వం మనుగడ రెండేళ్ళు మాత్రమేనని, దేవుడు దయదలిస్తే ఏడాదిలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.’ అని శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. బందరు ఓడరేవు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు చేపట్టిన 33 వేల ఎకరాల భూ సమీకరణను నిరసిస్తూ గురువారం రైతు భరోసా యాత్ర నిర్వహించారు. బుద్ధాలపాలెం, కోన గ్రామాల్లో బాధిత రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. రాజన్న పాలన మళ్ళీ వస్తుందని ప్రజల కష్టాలన్నీ తీరతాయని అన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోవల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడి పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారుతున్నారని విమర్శించారు. అభివృద్ధి ముసుగులో భూదాహం తీర్చుకుంటూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోర్టు నిర్మాణానికి 1500 ఎకరాలు సరిపోతాయని చెప్పిన చంద్రబాబు నేడు పరిశ్రమల పేరుతో 33వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడం గర్హనీయమన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తీరులో కూడా అనేక లోపాలు ఉన్నాయన్నారు. ఒకసారి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండానే మరోసారి భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులకు బిచ్చమేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నష్టపరిహారంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ పేరిట ఎకరానికి వెయ్యి గజాలు ఇస్తామనడం రైతులను నిలువునా మోసగించడమేనన్నారు. ఇటువంటి ప్రభుత్వ దుశ్చర్యలను రైతులంతా సంఘటితమై ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాజధాని పేరుతో తుళ్ళూరు ప్రాంత రైతులను నిలువునా ముంచేశారన్నారు. మళ్ళీ బందరులో అటువంటి పరిస్థితినే తీసుకు వచ్చారన్నారు. చంద్రబాబు అరాచకాలు ఇంకెన్నాళ్ళో సాగవన్నారు. రైతులంతా సంఘటితంగా ఉండి తమ భూముల కోసం పోరాడాలన్నారు. రైతుల పోరాటానికి వైకాపా మద్దతుగా నిలుస్తుందన్నారు.

చిత్రం..బందరు మండలం బుద్ధాలపాలెం గ్రామసభలో మాట్లాడుతున్న వైఎస్ జగన్