ఆంధ్రప్రదేశ్‌

ఏ తప్పూ చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలన్న ప్రజల ఆకాంక్షను అసెంబ్లీలో వినిపించామే తప్ప తాము ఎవరినీ అగౌరవపరచలేదని, ఎటువంటి తప్పు చేయలేదని వైకాపా ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ ప్రివిల్లేజస్ కమిటీ ముందు తన వాదనను వినిపించారు. శుక్రవారం ప్రివిల్లేజస్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో కమిటీ సభ్యులు శ్రావణ్‌కుమార్, రామకృష్ణారెడ్డి, పి.రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. లోగడ అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకుని వెళ్ళిన ఘటనపై స్పీకర్ ప్రివిల్లేజస్ కమిటీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని హాజరు కావలసి ఉండగా, వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నామని, తమకు కొంత గడువు కావాలని కోరుతూ కమిటీకి లేఖ పంపించారు. కాగా పినె్నల్లి రామకృష్ణారెడ్డి హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం పినె్నల్లి తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తే నేరస్తులుగా, దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆ రోజున అసెంబ్లీలో ఏమి జరిగిందో దృశ్యాల సిడిని తమకు ఇవ్వకుండానే కమిటీ ముందు హాజరుకావాలని నోటీసు పంపించారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర పెట్టారని విమర్శించారు.