ఆంధ్రప్రదేశ్‌

మంగళ సూత్రాలపై ప్రధాని మోదీ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ప్రధాని నరేంద్ర మోదీ కన్ను మహిళల మంగళ సూత్రాలపై పడిందని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. మహిళల జోలికి వెళితే ఎన్డీయే భస్మం అవుతుందని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ హెచ్చరించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నాడు పేద ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేస్తే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాలను నిర్వీర్యం చేసి, బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడేలా చేసిందని ఆయన అన్నారు. ప్రతి మహిళ ఆభరణాల్లో తన తల్లిని చూసుకుంటుందని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల ముందు మహిళలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడుదల చేస్తామని హామీనిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించారని ఆయన విమర్శించారు. భారత్‌ను నగదు రహిత దేశంగా మార్చాలనుకుంటే ప్రజలు బిజెపి రహిత భారత్‌గా మారుస్తారని ఆయన హెచ్చరించారు. బిజెపిని నడిపిస్తున్నది నల్లకుబేరులేనని అన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.