ఆంధ్రప్రదేశ్‌

అఖిల భారత పోలీస్ హ్యాండ్‌బాల్ విజేత ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (స్పోర్ట్స్) డిసెంబర్ 2: అఖిల భారత పోలీస్ క్లస్టర్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లు హ్యాండ్‌బాల్ టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. శుక్రవారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా సాగిన హ్యాండ్‌బాల్ ఫైనల్ పోటీలో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు 34-31 గోల్‌ల తేడాతో సిఆర్‌పిఎఫ్ జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు 19-13 గోల్‌ల ఆధిక్యతతో హర్యానా జట్టును చిత్తుచేసింది. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన బి.్ఫణికుమార్ (ఏపి), దుర్గకళ (ఏపీ) బెస్ట్ ప్లేయర్ అవార్డును దక్కించుకున్నారు. యోగా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తృతీయ స్థానం గెలుచుకుంది. పోటీల అనంతరం జరిగిన ముగింపు ఉత్సవానికి మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమానికి డిజిపి సాంబశివరావు అధ్యక్షత వహించగా గౌరవ అతిథులుగా ఇంటిలిజెన్స్ ఏడి అరవింద్‌కుమార్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్, పి.విష్ణుకుమార్‌రాజు, బండారు సత్యనారాయణమూర్తి, ఏయూ వైస్-్ఛన్సలర్ ఆచార్య నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.