ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి చేరిన రూ.365 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, డిసెంబర్ 2: పెద్దనోట్లు రద్దుతో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఏర్పడిన నోట్ల కొరత నేపథ్యంలో ఆర్‌బిఐ నుంచి ప్రత్యేక విమానంలో రూ.365 కోట్లు శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాయి. రూ.2 వేల నోట్ల కట్టలను 19 పెట్టెల్లో అమర్చి రేణిగుంటకు చేర్చారు. రేణిగుంట నుంచి పటిష్ఠ భద్రత మధ్య తిరుపతి ఆంధ్రాబ్యాంకుకు తరలించారు. పెద్దనోట్ల రద్దుతో చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని బ్యాంకులలో నగదు కొరత విపరీతంగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంకుకు చేసిన అభ్యర్ధనతో రూ.365 కోట్లు విమానంలో రేణిగుంటకు పంపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖ 2500 కోట్ల కొత్త నోట్లను ఆంధ్రప్రదేశ్‌కు వివిధ మార్గాలలో తరలించారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి ట్రూజెట్ ప్రత్యేక విమానంలో రూ.365 కోట్లను రేణిగుంట విమానాశ్రయానికి చేర్చారు. ఈ నగదును ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గాన భారీ బందోబస్తు మధ్య తిరుపతి అంధ్రాబ్యాంకుకు తరలించారు. ఈ డబ్బును తిరుపతి నుంచి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లా బ్యాంకులకు అవసరం మేరకు తరలించనున్నారు.