ఆంధ్రప్రదేశ్‌

ఒత్తిడి తగ్గే వరకూ ఓవర్ టైమ్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: రిజర్వు బ్యాంక్ నుంచి వచ్చిన నగదును వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఒత్తిడి తగ్గే వరకూ ఓవర్‌టైమ్ పని చేయాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నగదు రహిత లావాదేవీలపై విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లు, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్లతో టెలికాన్ఫరెన్సు సిఎం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నానికే బ్యాంకుల్లో నగదు అయిపోవడంతో రిజర్వు బ్యాంక్ గవర్నర్‌తో మాట్లాడి రూ.2500 కోట్లు తెప్పించడం మంచిదైందన్నారు. ప్రత్యేక విమానాల్లో నగదును విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప తరలించామన్నారు. అక్కడ నుంచి వివిధ బ్రాంచ్‌లకు పంపామన్నారు. నగదు పంపిణీలో తెల్లవారుఝాము 3 గంటల వరకూ పని చేసిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. ఒకటో తేదీ రద్దీని తట్టుకునేందుకు సమర్ధవంతంగా, సమన్వయంతో పని చేసిన బ్యాంక్ సిబ్బందిని తీరును ప్రశంసించారు. భౌతిక నగదు సమస్యను అధిగమించేందుకు ప్రీపెయిడ్ కార్డు దోహదపడుతుందన్నారు.