ఆంధ్రప్రదేశ్‌

నగదు రహిత లావాదేవీలకు నజరానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 2: రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ముందుకు వచ్చే గ్రామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నజరానాలు ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో రానున్న రోజుల్లో నగదు రహిత లావాదేవీలు విజయవంతంగా నిర్వహించే గ్రామాలకు రూ.10 వేలు నుంచి రూ.లక్ష వరకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించారు. అనంతపురం జిల్లా గొల్లపల్లి వద్ద శుక్రవారం జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు సహకరించే నిరుద్యోగులకు సర్ట్ఫికెట్లు ఇచ్చి ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు బిజినెస్ కరస్పాండెంట్లను నియమిస్తున్నామన్నారు. అత్యవసరానికి డబ్చిచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో నగదు మార్పిడికి ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు, రూపేకార్డులు వాడాలన్నారు. నగదు లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలో 100 మందికి శిక్షణ ఇస్తామన్నారు. వీరు బాగా లావాదేవీలు జరిపించినట్లయితే రూ.5 ప్రోత్సాహకంగా ఇస్తామని సిఎం వెల్లడించారు.
ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలు అలవాటు చేసుకోవాలని, అందరూ సహకరిస్తే ఒక్క నెలలోనే నోట్ల కష్టాలను అధిగమించవచ్చని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో అన్నివర్గాల ప్రజలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులు, కూలీలు, మధ్య తరగతి ప్రజలందరూ నష్టపోయారన్నారు. కష్టాలొచ్చాయనుకుంటే ఇంకా నష్టమేనని, కనుక అందరూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. కొంత సొమ్ము చేతలో ఉంటే చాలు అవసరాలు తీర్చుకోవచ్చని అన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్రం రూ.800 కోట్లు నష్టపోయిందన్నారు. ఇంకా నష్టపోకుండా ఉండేందుకు ఆన్‌లైన్ విధానాలు తప్పవన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
‘రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం... కేంద్రంతో గొడవ పడాలంటే క్షణం పట్టదు...మీరే (ప్రజలు) నాకు హైకమాండ్. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తా.. ఏవరికీ భయపడాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తూ రాజకీయాల కోసం రాజకీయం చేయవచ్చని, ప్రజాహితం కోసం రాజకీయ చేయాలంటే సమయస్ఫూర్తి ఉండాలని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు వీలుందని, అందుకే ప్యాకేజీకిఒప్పుకున్నామని పునరుద్ఘాటించారు. ప్రజల కోసం దూరదృష్టి ఉండాలని, అందుకే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కేంద్రానికి చెప్పానన్నారు.