రాష్ట్రీయం

బాధిత కుటుంబాలు అంగీకరిస్తే పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 2: భారత వైమానిక దళానికి చెందిన ఎఎన్ 32 విమానం గల్లంతులో నావల్ ఆర్మోమెంట్ డిపో (ఎన్‌ఎడి)కి చెందిన సిబ్బంది కుటుంబీకులు అంగీకరిస్తే, పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తూర్పు నౌకాదళం ప్రకటించింది. గత జూలై 22న వైమానికి దళ విమానం చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే గల్లంతైన సంగతి తెలిసిందే. విమానంలో 21 మంది వైమానిక దళ సిబ్బందితో పాటు ఎన్‌ఎడికి చెందిన సాధారణ ఉద్యోగులు 8 మంది ఉన్నారు. గల్లంతైన విమానాన్ని గాలించేందుకు భారత నౌకాదళం, వాయుసేన చేయని ప్రయత్నం లేదు. భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. నౌకాదళానికి చెందిన 21 యుద్ధ నౌకలు, 1 జలాంతర్గామి, 300 ఎయిర్ క్రాఫ్ట్‌లతో నెలల తరబడి ఎఎన్ 32 కోసం గాలించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటి) సహా విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 50వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో సముద్రాన్ని 3000 మీటర్ల లోతు వరకూ గాలించారు. దీనితో పాటు సముద్ర అధ్యయన నౌకలు సాగర్ నిధి, సముద్ర రత్నాకర్ శక్తి మేరకు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. అయినప్పటికీ ఎఎన్ 32 ఆచూకీ లభ్యం కాకపోవడంతో చివరకు అందులో ఉన్న వారంతా బతికే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చారు. గల్లంతైన విమానంలోని వాయుసేన సిబ్బంది 21 మందికి సంబంధించి లాంఛనాలు పూర్తి చేయగా, నౌకాదళం ఆధీనంలోని ఎన్‌ఎడి సివిల్ ఎంప్లారుూస్ అంశంలోనే కొంత సందిగ్ధత కొనసాగుతోంది. ఇదే విషయమై తూర్పు నౌకాదళ ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్పందిస్తూ గల్లంతైన ఎఎన్ 32 యుద్ధ విమానంలోని వారి ఆచూకీ లభ్యం కాని కారణంగా వీరంతా యుద్ధంలో మరణించినట్టు భావించాలని రక్షణ మంత్రిత్వ శాఖను కోరినట్టు తెలిపారు. దీనివల్ల వారి కుటుంబాలకు మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో గల్లంతైన ఎన్‌ఎడి సివిల్ ఎంప్లారుూస్ కుటుంబీకులు కూడా నిరభ్యంతర సర్ట్ఫికెట్ (ఎన్‌ఓసి) సమర్పిస్తే, వారికి అందాల్సిన పరిహారం చెల్లించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇప్పటి వరకూ ఆరు కుటుంబాలకు చెందిన వారు ఎన్‌ఓసిలు సమర్పించారని, మరో ఇద్దరు అందజేయాల్సి ఉందన్నారు. బాధిత కుటుంబాలు ఎన్‌ఓసిలు సమర్పిస్తే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ చీఫ్ రిజిస్ట్రార్ మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని, దీన్ని అనుసరించి వారి కుంటుంబాలకు పరిహారం చెల్లింపు వంటి అంశాలను పూర్తి చేస్తామని అన్నారు. ఎన్‌ఓసి అందిన మీదట బాధిత కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ కల్పనకు ఆస్కారం ఉంటుందన్నారు.