ఆంధ్రప్రదేశ్‌

ఎయు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సమీకృత కోర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 3: ఆంధ్రావిశ్వవిద్యాలయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎయు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో రానున్న విద్యా సంవత్సరానికి బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సును సెల్ఫ్‌ఫైనాన్స్ విభాగంలో ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆరేళ్ల కాలపరిమితి గల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించాలని శనివారం జరిగిన అకడమిక్ సెనేట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ఈసిఇ, కంప్యూటర్ విభాగంలో అమలు చేస్తారు. ఒక్కో విభాగంలో 30 సీట్లలో ప్రవేశం కల్పిస్తారు. ఎయు సంగీత విభాగం నుంచి సాయంకాలం కోర్సులుగా ఏడాది కాల పరిమితి కలిగిన డిప్లమో ఇన్ డాన్స్, డిప్లమో ఇన్ కర్నాటక సంగీతం, డిప్లమో ఇన్ తాల వాయిద్యం కోర్సులు ప్రవేపెట్టలని సెనేట్ నిర్ణయించింది. ఇక మీదట ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్ కోర్సును ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ కోర్సుగా మార్పు చేశారు. దీనిలో ఇనుస్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌గా పొందుపరచాలని నిర్ణయించారు. దూర విద్య కేంద్రం నుంచి ఏడాది కాల పరిమితి గల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఎయు దూరవిద్యకేంద్రం అందించనుంది. హెచ్‌ఆర్‌ఎం కోర్సులో ప్రవేశానికి సీట్లను 62 నుంచి 50కి తగ్గించారు. 30 సీట్లను రెగ్యులర్ విధానంలోను, 20 సీట్లు సెల్ఫ్ పైనాన్స్ విధానంలోను భర్తీ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బికాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సును ప్రారంభించేందుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఎయు ఇంజనీరింగ్ రసాయన శాస్త్ర విభాగంలో ఐదేళ్ల సమీకృత రసాయనశాస్త్ర కోర్సును ప్రారంభించడం (అనువర్తిత రసాయన శాస్త్రం ప్రాధాన్యంగా) కోర్సును నిర్వహించేందుకు సెనేట్ అనుమతించింది. ఎకనామిక్స్ విభాగంలో ఐదేళ్ల ఎంఎ ఎకనామిక్స్ కోర్సును రద్దు చేయడంపై నిర్ణయాన్ని సెనేట్ వాయిదా వేసింది. సమావేశంలో ఎయు ఉప కులపతి ఆచార్య జి నాగశ్వరరావు, పూర్వపు ఉపకులపతులు ఆచార్య కోనేరు రామకృష్ణారావు, కెవి రమణ, జిఎస్‌ఎన్ రాజు, పాలకమండలి సభ్యులు ఆచార్య జి శశిభూషణరావు, ఆచార్య ఎం ప్రసాదరావు, ఆచార్య ఎన్ బాబయ్య, రిజిస్ట్రార్ వి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.