ఆంధ్రప్రదేశ్‌

పెద్దనోట్ల రద్దుపై జాతీయస్థాయి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, డిసెంబర్ 3: పెద్దనోట్లు రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. బంగారం జోలికొస్తే మహిళలు తిరగబడతారని, పరకలతో తరిమికొడతారని హెచ్చరించారు. నోట్ల రద్దు, బంగారం లెక్కలపై జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహిస్తామన్నారు. శనివారం అనంతపురం నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో సామాన్య ప్రజలు, పెన్షనర్లు, చిన్నవ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే అదే సమయంలో అక్రమ పద్దతుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి పెద్దవాళ్లుగా చెలామణి అవుతున్న వారెవ్వరూ ఇబ్బందులు పడటం లేదన్నారు. రైతుల వద్ద నల్లధనం ఉండదన్నారు. డబ్బుల కోసం రైతులే బ్యాంకులకు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందంటే ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతోందన్నారు. రూ. 80 లక్షల కోట్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని ప్రచారం చేసిన మోదీ ఇంతవరకు ఒక్కరికి కూడా డబ్బు జమ చేయలేదన్నారు. ఇటీవల కేంద్రమంత్రి దత్తాత్రేయ కూతురి పెళ్లిలో భోజనాలకే రూ.50 లక్షలు ఖర్చుచేశారని, గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాస్‌రావు ఇంట్లో జరిగిన పెళ్లికి పెంట్‌హాల్‌కే రూ. 70 లక్షలు ఖర్చుపెట్టారని, ఇక బిజెపికి చెందిన గాలిజనార్థన్‌రెడ్డి కూతురి పెళ్లికి ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేసినా పట్టించుకోని ప్రభుత్వం నిరుపేదల పెళ్లిళ్లపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే బిజెపి ప్రభుత్వం సామాన్యులను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నట్లు కనిపిస్తోందని, డబ్బు ఉన్న పెద్దవాళ్లను కాదని స్పష్టమవుతోందన్నారు.
తాజాగా జనం వద్ద ఉన్న బంగారం లెక్కలు అడుగుతున్నారని, మహిళల బంగారం జోలికి వస్తే వారు తిరగబడడం ఖాయమన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించి బంగారంపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి టిడిపి, బిజెపి ప్రభుత్వాలు గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, నాయకులు జాఫర్, నారాయణస్వామి, రాజారెడ్డి, వేమయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.