ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్ ఆఖరుకు నగదు రహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 3: డిసెంబరు నెలాఖరుకు అన్ని రకాల ఆర్ధిక లావాదేవీలనూ నగదు రహితంగా నిర్వహించేందుకు తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రస్థాయికి చేరుతుండగా ఇంకోవైపు ఆర్థిక లావాదేవీలు సజావుగా జరిగేందుకు వీలుగా నగదు రహిత వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకుల్లో నగదు నిల్వలు అందుబాటులో లేకపోవడం, తుదకు డిసెంబరు 1వ తేదీకి ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు 10వేల రూపాయల వంతున నగదు చెల్లించే అవకాశం కూడా లేకపోవడం ఆయా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల వైపు మళ్లడం ద్వారా పరిస్థితిలో చాలావరకు మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం వేరే పని పెట్టుకోకుండా ఇదే సమస్యపై రోజుల తరబడి కసరత్తు చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 59లక్షల బ్యాంకు ఖాతాలున్నాయి. అలాగే జిల్లాలో 4 లక్షల 70వేల మంది ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులున్నారు. వీరిలో 40వేల మంది మినహా 95 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. 50 శాతం మందికి పైగా రూపే కార్డులున్నాయి. ఈ రూపే కార్డులను స్వైప్ చేసి ఏ విధంగా ఆర్ధిక లావాదేవీలు నిర్వహించాలనే విషయమై గ్రామస్థాయిలో అవగాహన కలుగజేసేందుకు శనివారం నుండి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ గ్రామసభల్లో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేసి, ప్రతి కుటుంబంలో ఒకరికి విధిగా బ్యాంకు ఖాతా ఉండేలా చర్యలు తీసుకుంటారు. అసలు అకౌంట్ లేని వారికి అకౌంట్ కల్పించడం, అకౌంట్ పని చేయకపోతే తిరిగి తెరిపించడం, రూపే కార్డులను ఈ-పోస్ యంత్రాల్లో వినియోగించడం వంటి అంశాలపై అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబరు నెలాఖరుకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించే లక్ష్యంతో పని చేయాలని సంబంధిత అధికారులు, బ్యాంకర్లను ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. అన్ని రేషన్ షాపులు, కిరాణా షాపులు, మెడికల్ స్టోర్స్, ఇతర దుకాణాల్లో ఈ-పోస్ యంత్రాలను విధిగా ఏర్పాటుచేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం జిల్లాలో సుమారు 2వేల ఈ-పోస్ మెషిన్లను అందుబాటులోకి తీసుకురాగలిగారు. నెలాఖరుకు అన్ని రకాల దుకాణాల్లో ఈ-పోస్ యంత్రాల ద్వారానే ఇక లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.