ఆంధ్రప్రదేశ్‌

జయలలిత త్వరలో డిస్చార్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 3: రెండు నెలలుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను త్వరలోనే డిస్‌చార్జ్ చేసే అవకాశం ఉందని అపోలో ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జయలలితను ఒక ప్రత్యేక వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఆమె కూడా వైద్యసేవలకు బాగా స్పందిస్తున్నారని తెలిపారు. చిత్తూరు పట్టణ సమీపంలో నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేయడం తమ తండ్రి అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి జీవితాశయమని ఆ పనులు ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను మెడికల్ హబ్‌గా మార్చేందుకు అపోలో హాస్పిటల్స్ తమవంతు సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందని ఆమె తెలిపారు.