ఆంధ్రప్రదేశ్‌

రూ. లక్ష పరిహారాన్ని ఆ మహిళకు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ఒక మహిళ నివసిస్తున్న ఇంటిని కూల్చివేసినందుకు ఒక లక్ష రూపాయలను నష్టపరిహారంగా ఆమెకు చెల్లించాలని హైకోర్టు విజయనగరం మున్సిపాలిటీని ఆదేశించింది. ఈ తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు వెలువరించారు. విజయనగరం మున్సిపాలిటీలో పూల్‌బాగ్ రోడ్డులో ఉంటున్న ఎం శ్రీదేవి అనే మహిళ తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీ వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ దాఖలు చేసిన సివిల్ దావాతో నిమిత్తం లేకుండా ఈ నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. తాను అనేక సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నానని, 2010 నవంబర్ 9వ తేదీన ప్రభుత్వం పట్టా కూడా ఇచ్చిందని శ్రీదేవి తన పిటిషన్‌లో తెలిపారు. అప్పటికే తాను 12 సంవత్సరాలుగా ఆ స్థలంలో ఉంటున్నానని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన తన ఇంటిని కూల్చరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందన్నారు. కాని కూల్చివేయడంతో కోర్టు ధిక్కరణ కింద బాధిత మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వుల కంటే ముందు మహిళ ఇంటిని కూల్చివేసినట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. ఏపి మున్సిపాలిటీ చట్టం 1965ను పరిగణనలోకి తీసుకుని సంబంధించిన మున్సిపల్ కమిషనర్‌పై అవసరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తగిన చట్టపరమైన ప్రక్రియను అమలు చేయకుండా పిటిషనర్ ఇంటిని కూల్చివేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది.