ఆంధ్రప్రదేశ్‌

రాజమహేంద్రవరానికి కొత్త మాస్టర్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: తూర్పుగోదావరి జిల్లా రివర్ సిటీ రాజమహేంద్రవరం మాస్టర్ ప్లాన్‌కు ఎట్టకేలకు కౌన్సిల్ ఆమోదం లభించింది. రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో సవరించిన మాస్టర్ ప్లాన్‌కు పాలకవర్గ ప్రజా ప్రతినిధులు ఆమోద ముద్ర వేశారు. గతంలో రెండుసార్లు తీవ్ర తర్జనభర్జనల మధ్య వాయిదా పడిన మాస్టర్ ప్లాన్ అంశంపై కౌన్సిల్ సమగ్రంగా చర్చించి ఎట్టకేలకు ఆమోదం తెలియజేయడంతో రానున్న 30 ఏళ్లకు సరిపడే విధంగా నగరం ప్రణాళికాబద్ధ అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టయింది. పాత మాస్టర్ ప్లాన్‌లోని క్వారీ ఏరియా రోడ్డును కొత్త మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించిన నేపథ్యంలో వైసిపి సభ్యులు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి నేతృత్వంలో నిరసన తెలియజేశారు.
మాస్టర్ ప్లాన్‌లో రోడ్డును తొలగించడంపై తమ డీసెంట్ నమోదుచేయాలని పట్టుబట్టిన వైసిపి గందరగోళం మధ్య ఏకగ్రీవంగా మాస్టర్ ప్లాన్‌ను ఆమోదం తెలియజేస్తూ మేయర్ సమావేశాన్ని ముగించారు. మేయర్ వైఖరిని నిరసిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత కౌన్సిల్ హాల్లోనే వైసిపి సభ్యులు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇబ్బందులు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ భావితరాల బాగు కోసం కొత్త మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించాల్సిందేనని, ఆ దిశగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
రోడ్లకు అడ్డుగా గుడులు, గోపురాలు కట్టేస్తున్నారని, ఇటువంటి ఆక్రమణలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి అన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం చూసుకున్నా మురుగు డ్రెయిన్లపై గుడులు కట్టేస్తూ అపచారం చేస్తున్నారని ఇది సరికాదని, కొంతమంది కార్పొరేటర్లే వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ భావితరాల భవిష్యత్ కోసం నగరం ప్రణాళికాబద్ధంగా ఉండాలని కొత్త మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించడం జరుగుతోందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. విఎల్ పురం నుంచి మోరంపూడి రోడ్డును 80 అడుగుల రోడ్డుగా మార్పు చేస్తూ మిగిలిన అన్ని రోడ్లను యధాతథంగా ఆమోదం తెలియజేయాలని కోరుతూ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టిడిపి పక్ష ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు ప్రతిపాదించడంతో ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదించింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ప్రస్తుతం విలీనమైన 13 గ్రామాలతోపాటు గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ-గుడాను దృష్టిలో పెట్టుకుని మిగిలిన అన్నిగ్రామాలను విలీనం చేయాల్సి ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి సూచించారు. ఈ మేరకు అధికారులు గుడాకు ప్రతిపాదనలు పంపించాలని కౌన్సిల్‌లో తీర్మానించారు. రాజమహేంద్రవరం నగరానికి ముఖద్వారంగా జాతీయ రహదారిపై ఉన్న వేమగిరిని కూడా గుడాలో విలీనం చేయాల్సి ఉందన్నారు. ద్వారపూడి కెనాల్ రోడ్డు, ఇటు ఎడిబి రోడ్డు మధ్యలో పారిశ్రామిక కారిడార్‌ను కూడా గుడాలో విలీనం చేయాల్సి ఉందని చెప్పారు. ఇందుకు అవసరమైన రీతిలో ప్రతిపాదనలను ప్రజాప్రతినిధులు కూడా తమ తమ లేఖల ద్వారా ప్రభుత్వానికి పంపించాలని, అధికారులు కూడా ప్రతిపాదనలు పంపిస్తామని కమిషనర్ విజయరామరాజు కౌన్సిల్‌కు తెలియజేశారు.