ఆంధ్రప్రదేశ్‌

రైట్..రైట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 9: అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్కడా మలుపుల్లేని 598.830 కిలోమీటర్ల ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 (10,843 హెక్టార్లు) ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 1518.75 హెక్టార్ల అటవీ భూమి వుంది. పరిస్థితులను బట్టి సేకరణ లేక సమీకరణ ద్వారా ఈ భూమిని సమకూర్చనున్నారు. ఇంత దూరం రోడ్డు మలుపుల్లేకుండా కొనసాగించడానికి అవసరమైన చోట సొరంగమార్గాలు, వంతెనలు నిర్మించనున్నారు. దేశంలో ఎక్కడా ఇటువంటి రహదారి లేదు. ఇదే మొదటిదని అధికారులు చెప్పారు. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 29,912 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. మలుపుల్లేని ఈ రోడ్డుకు కలుపుతూ కడప, కర్నూలు నుంచి మరో రెండు రోడ్లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రోడ్డు నిర్మాణానికి రూ.27,635 కోట్లు, భూ సేకరణకు రూ.2000 కోట్లు, పర్యావరణానికి (రోడ్డు నిర్మాణ వ్యయంలో ఒక శాతం) రూ.276.35 కోట్లుగా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రోడ్డుకు కావలసిన భూమిని సమకూరిస్తే, ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)ను కేంద్రం ఆదేశించింది. అనంతపురం రహదారిని ప్రకాశం జిల్లా వరకు తొలుత నాలుగు లైన్లలో నిర్మించాలని, అలాగే కర్నూలు నుంచి, కడప నుంచి నిర్మించే వాటిని కూడా ప్రకాశం జిల్లా వరకు నాలుగు లైన్లు నిర్మించాలని భావించారు. అయితే ఇప్పుడు వాటిని కూడా ఆరు లైన్లలో నిర్మించాలని ప్రతిపాదించారు. భూమిని మాత్రం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుచూపుతో 8 లైన్లకు సరిపడ సేకరిస్తారు.
సేకరణ లేక ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సమకూర్చే బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అంతేకాకుండా త్వరితగతిన ఈ రోడ్డుకు సంబంధించిన సర్వే పూర్తిచేసి, కావలసిన భూమిలో ప్రభుత్వ, ప్రైవేట్ భూమి వివరాలు తెలుపమని కూడా కలెక్టర్లను ఆదేశించారు. రోడ్డు పొడవును జిల్లాల వారీగా పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో అత్యధిక పొడవు 223.950 కిలోమీటర్లు వుంటుంది. అందువల్ల ఈ జిల్లాలో అత్యధికంగా 3351 హెక్టార్లు సేకరిస్తారు. అనంతపురం జిల్లాలో 68.650 కిలోమీటర్ల రోడ్డుకు 1268 హెక్టార్ల భూమి, కర్నూలు జిల్లాలో 160.600 కిలోమీటర్ల రోడ్డుకు 2281 హెక్టార్లు, కడప జిల్లాలో 62.200 కిలోమీటర్ల రోడ్డుకు 824.25 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 80.430 కిలోమీటర్ల రోడ్డుకు 1600 హెక్టార్ల భూమి సేకరిస్తారు. సేకరించే దానిలో అటవీ భూమి కూడా అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే 742 హెక్టార్లు వుంది. మిగిలిన జిల్లాలను పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో 86 హెక్టార్లు, కర్నూలు జిల్లాలో 582 హెక్టార్లు, కడప జిల్లాలో 108.75 హెక్టార్ల భూమి సేకరిస్తారు. గుంటూరు జిల్లాలో అటవీ భూమి లేదు. అయిదు జిల్లాల్లో నిర్మించే ఈ రోడ్డుని పూర్తిస్థాయి గ్రీన్‌ఫిల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా అభివృద్ధి చేస్తారు. ఈ రోడ్డుపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా ప్లాన్ రూపొందించారు. ఈ రోడ్డుకు కావలసిన భూమి మొత్తాన్ని సేకరణ లేక సమీకరణ ద్వారా ఆరు నెలల్లో సమకూర్చుకొని, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భూసేకరణకు 5 జిల్లాల్లో వేర్వేరుగా భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఒక అటవీ సెల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. అటవీ భూములకు కావలసిన అనుమతులు పొందే వ్యవహారాలను ఈ సెల్ చూస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇది పూర్తయితే రాయలసీమ ముఖచిత్రం మారిపోతుంది. మహర్ధశ పట్టే అవకాశం ఉంది. భారీస్థాయిలో రహదారులు నిర్మించడం వల్ల ఆ మూడు జిల్లాల నుంచి రాజధాని అమరావతికి త్వరగా రావచ్చు. రవాణాకు అనుకూలత ఏర్పడుతుంది.