ఆంధ్రప్రదేశ్‌

నల్లధనమని తేలితే శేఖర్‌రెడ్డిని టిటిడి పదవి నుండి తొలగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, డిసెంబర్ 9: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి వద్ద ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు నల్ల ధనమేనని రుజువైతే ఆయనను పదవి నుండి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. అలాగే ఆయనపై చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్నను శుక్రవారం మంత్రి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనాన్ని పలికారు. ఆలయ ఇవో వేండ్ర త్రినాధరావు ఆయనకు చిన వెంకన్న చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందించారు. అనంతరం మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమేనన్నారు. అయితే ప్రజలంతా నల్లధన నిర్మూలనను స్వాగతిస్తున్నారన్నారు. ఈ క్రమంలో మోదీ పాలనను ప్రజలు కోరుకుంటున్నట్టు మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.

చిత్రం..చినవెంకన్న ఆలయంలో మంత్రి పైడికొండలకు వేదాశీర్వచనం అందిస్తున్న అర్చకులు