ఆంధ్రప్రదేశ్‌

వార్ధాపై వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: వార్ధా తుపానును ఎదుర్కొనేందుకు మొదటిసారిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇచ్చిన సూక్ష్మస్థాయి నివేదికను ఉపయోగించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వార్ధా తుపానుపై ఆయన విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో శనివారం రాత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తుపాన్ల రాకను ముందుగానే గుర్తించేందుకు వీలుగా ఇస్రో సహా ప్రపంచంలోని ఉత్తమ ఏజన్సీల సేవలు తీసుకోనున్నట్లు తెలిపారు. తుపాను ఏర్పడే పరిస్థితిని ముందుగా అంచనా వేయడం, తుపానుగా ఏర్పడటం, గమనం, తీరాన్ని దాటేందుకు పట్టే సమయం, తీరం దాటకముందు, దాటాక ఆ సమయంలో ఉండే గాలుల వేగం, తుపాను తీవ్రత వంటివి ముందుగానే అంచనా వేసేందుకు వీలుగా ఆయా సంస్థల సేవలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఏయే ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు అవుతుంది? తదితర అంశాలను ముందుగానే అంచనా వేసేందుకు వీలు ఉంటుందన్నారు. దీని వల్ల నష్టాన్ని గణనీయంగా నివారించే వీలు ఉంటుందన్నారు. తుపాను వచ్చి వెళ్లాక, ఇందుకు సంబంధించి ఆయా ఏజన్సీలు ఇచ్చిన వివరాలను వాస్తవ పరిస్థితులతో పోల్చి చూస్తామన్నారు. హుదూద్ తుపాను కన్నా వార్ధా తుపాను తీవ్రత తక్కువని, దీనివల్ల గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తీరాన్ని సమీపిస్తున్న సమయంలో గాలుల వేగం తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల అధికార్లను అప్రమత్తం చేశామన్నారు. తుపానుకు తోడు నోట్ల రద్దు, వరుస సెలవులు వల్ల మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉందని భావించి, ముందుగానే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగదును కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. నాలుగు జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతున్నామని, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కూడా పంపామన్నారు. ఎప్పటికప్పడు సమాచారం అధికారులకు, మీడియాకు తెలిసేలా బులెటిన్‌లను విడుదల చేయనున్నామన్నారు. కాగా తుపాను 12వ తేదీ సాయంత్రానికి శ్రీహరికోట- కృష్ణపట్నం మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇస్రో శాస్తవ్రేత్త రాజశేఖర్ సిఎంకు తెలిపారు. రెండు రోజుల్లో 190 సెంటీమీటర్ల మేర ఆరు జిల్లాల్లో వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు.

చిత్రం... సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు