ఆంధ్రప్రదేశ్‌

కొత్త కరెన్సీ ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: బ్యాంకుల్లో కొత్త కరెన్సీ సామాన్యులకు అందకుండా ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో కేంద్రం దర్యాప్తు జరిపించాలని టిడిపి అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, 40 రోజులు గడచినా ఇంతవరకు చిలర్ల నోట్లు సామాన్యులకు అందుబాటులోకి రాలేదన్నారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్ధ చిన్నాభిన్నమవుతోందన్నారు. కొంత మంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. ఐదు లక్షల 40 వేల కొత్త కరెన్సీనివిడుదల చేశామని కేంద్రం చెబుతోందని, కాని ఈ డబ్బు ఎక్కడికి పోయిందన్నారు. కేంద్రం తక్షణమే 50,100 నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేయాలని, ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్‌లను స్వాధీనం చేసుకుని అక్కడ కూడా నోట్లను ము ద్రించాలన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కమిటీ సలహాలను కేంద్రం స్వీకరించాలన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా వైకాపా అధ్యక్షుడు జగ న్ టిడిపిని విమర్శించడం మానుకోవాలని, అవినీతికి మారుపేరైనా వైకాపాను ప్రజలు నమ్మే పరిస్ధితి లేదన్నారు. రాష్ట్రంలో కుల రాజకీయాలను రెచ్చగొడుతూ లాభపడాలని చూస్తున్న జగన్ ఆటలకు ప్రజలు చెక్ పెడతారన్నారు.