ఆంధ్రప్రదేశ్‌

చిల్లర సమస్యకు ఇక చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్రానికి బుధవారం మరో రూ.1,600 కోట్ల నగదు అదనంగా రానుందని, ఇందులో కూడా రూ.500 నోట్లు ఐదు వందల కోట్లు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని తన నివాసం నుంచి సోమవారం జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం వచ్చిన రూ.2,500 కోట్లలో కూడా ఐదు వందల రూపాయల నోట్లు రూ.500 కోట్లు ఉన్నాయని గుర్తుచేశారు. వీటితో చిన్ననోట్ల సమస్య కొంత తీరుతుందని ఆశాభావం వ్యక్తపర్చారు. అదనంగా వచ్చిన నగదు వల్ల చాలావరకు ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు. రాష్ట్రానికి శనివారం వచ్చిన రూ.2,500 కోట్ల నగదును అన్ని బ్యాంకుల శాఖలకు పంపిణీ చేయటం పూర్తయిందని, సోమవారం ఉదయమే అన్ని ఏటిఎంలలో నగదు నింపామని ఎస్‌ఎల్‌బిసి, ఆర్బీఐ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ నగదు పంపిణీలో గ్రామీణ బ్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తక్కువ నగదు వినియోగం, ఎక్కువ ఆన్‌లైన్ లావాదేవీలే ప్రస్తుత సమస్యకు పరిష్కారంగా చంద్రబాబు సూచించారు. ప్రతిఒక్కరూ నగదు, కార్డు, మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకుని మూడింటి ద్వారా నగదు లావాదేవీలను వీలునుబట్టి జరుపుకోవాలన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలకు నగదు చెల్లింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్ని రైతుబజార్లను నగదు రహితంగా మార్చాలని మార్కెటింగ్ శాఖ, ఫైబర్ గ్రిడ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుబజార్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అన్ని విశ్వవిద్యాలయాలు నగదు రహితం కావాలన్నారు. ఇప్పటికే చాలా విశ్వవిద్యాలయాల్లో వైఫై సదుపాయం కల్పించామంటూ, దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్ అందుబాటులోకి వస్తే నగదు రహిత లావాదేవీలు మరింతగా పెరుగుతాయని ఆకాంక్షించారు.