ఆంధ్రప్రదేశ్‌

ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 19: వెనుకబాటు తనాన్ని రూపుమాపకుండా ప్రాంతాల మధ్య వివక్ష చూపితే రాష్ట్రాల్లో వేర్పాటు వాదం మొదలవుతుందని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖలో శనివారం జరిగిన ఉత్తరాంధ్ర కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు తెలంగాణ వాదం బలంగా విన్పించగా, చివరకు రాష్ట్రం రెండుగా చీలిపోయిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి పేరిట రూ.24,350 కోట్లు కేటాయించాలని విభజన చట్టంలో కాంగ్రెస్ స్పష్టంగా పేర్కొందన్నారు. అయితే బిజెపి అధికారం చేపట్టిన అనంతరం వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి నిధుల మంజూరులో వివక్ష చూపిందని ఆరోపించారు.
ఒక్కో జిల్లాకు ఏడాదికి కేవలం రూ.50 కోట్లను మాత్రమే కేటాయించడం ద్వారా ఈ ప్రాంతాలపై వివక్ష చూపడం ప్రమాదకరమన్నారు. ఈ వివక్ష భవిష్యత్‌లో ప్రత్యేక ఉద్యమాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో టిడిపి, బిజెపిలు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని, అటువంటి ప్రమాదం భవిష్యత్‌లో చోటుచేసుకోకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు విభజన చట్టంలో పేర్కొన్న మాదిరి నిధులు కేటాయించాలని, అందుకు ప్రజలు చేపట్టే ఉద్యమాలకు కాంగ్రెస్ అధిష్టానం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బిజెపి, టిడిపిల మెడలు వంచే ఉద్యమాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయం వెలగపూడి వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్టు ప్రకటించారు. నోట్ల రద్దు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 31 నాటికి కష్టాలు తీరుతాయని ప్రధాని మోదీ ప్రకటించారని, అయితే రోజురోజుకూ సామాన్యుల ఇబ్బందులు పెరుగుతునే ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు రామచంద్ర కుంతియా మాట్లాడుతూ ఈ దేశాన్ని సమర్ధవంతంగా పాలించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. గత ఎన్నికల్లో ఓటమి ఒక గుణపాఠంగా, వచ్చే ఎన్నికల్లో విజయానికి క్షేత్ర స్థాయి నుంచి పనిచేయాలని హితవు పలికారు. రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి, కెవిపి రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, జెడి శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, ఎఐఐసిసి ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, మాజీ మంత్రులు వట్టి వసంత కుమార్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఎపిపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి