ఆంధ్రప్రదేశ్‌

ఎక్సైజ్ అధికారికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 19: అక్రమాస్తుల కేసులో పట్టుబడిన ఎక్సైజ్ అదనపు కమిషనర్ లక్ష్మణ భాస్కర్‌ను అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ సోమవారం ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టింది. అవినీతి అధికారికి ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ కె రామకృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ భాస్కర్ అక్రమాస్తులతో పాటు బినామీలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. పట్టుబడిన ఎక్సైజ్ అధికారి భాస్కర్‌కు చెందిన ఇళ్లపై తాము నిర్వహించిన సోదాల్లో పట్టుబడిన ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.58 కోట్లు కాగా, వీటి మార్కెట్ విలువ రూ.50 కోట్లను దాటుతుందని తెలిపారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన లక్ష్మణ భాస్కర్ గ్రూప్ 1 అధికారిగా ఎక్సైజ్ శాఖలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. స్థిరాస్తులు కూడబెట్టడంలో మక్కువ చూపించే భాస్కర్ తాను పనిచేసిన ప్రతి చోటా స్థలాలు, భూములు కొనుగోలు చేశారని తెలిపారు. తాజాగా విశాఖ సమీపంలోని కాపులుప్పాడలో ఎకరం స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటపటడినట్టు తెలిపారు. అలాగే విదేశీ మద్యంపై మక్కువ కలిగిన భాస్కర్ 25 బాటిళ్ల ఫారిన్ లిక్కర్‌ను ఇంట్లో ఉంచుకున్నాడని తెలిపారు.

చిత్రం..ఎసిబి సోదాల్లో లభ్యమైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు