ఆంధ్రప్రదేశ్‌

భారతి సిమెంట్స్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: భారతి సిమెంట్స్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అథారిటీ జప్తు చేయడంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో భారతి సిమెంట్స్ యాజమాన్యానికి ఊరట లభించినట్లయింది. ఈ సంస్థలను వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి నిర్వహిస్తున్న విషయం విదితమే. భారతి సిమెంట్స్‌కు సంబంధించి ఏడు రకాల ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అథారిటీ జారీ చేసిన ఆదేశాలపై వైఎస్ భారతి హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో విచారించి స్టే ఇచ్చారు. తమకు చట్టపరంగా న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు 45 రోజుల సమయం ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఇడి తరపున న్యాయవాదులు బదులిస్తూ ఇప్పటికే రూ.177 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను బదలాయించామని, మిగిలిన ఆస్తుల బదలాయింపుకు నోటీసులు ఇచ్చామన్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేటస్‌కో కొనసాగుతుందని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.