ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీలుగా దళిత క్రైస్తవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 20: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. క్రైస్తవులకు మరిన్ని సౌకర్యాలకు ఆయన హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదలు లేని రాష్ట్రంగా మార్చేందుకు క్రైస్తవ సోదరులు దేవుడిని ప్రార్ధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తనకు అండదండలు ఇవ్వాలని కోరారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి విజయవాడలో సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవ మత పెద్దలతో కలిసి తొలుత క్యాండిల్ సర్వీసు నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి రాష్ట్ర క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా వారినుద్ధేశించి ఆయన మాట్లాడుతూ క్రైస్తవులు తొలుత ఇతరులు కోసం ప్రార్ధనలు చేసిన తర్వాత వారి కోసం ప్రార్ధన చేసుకుంటారని, ఈ మించి సాంప్రదాయమే వారిలోని ప్రత్యేకతను చాటుతోందన్నారు. సేవాభావమే లక్ష్యంగా రాష్ట్రంలో, దేశంలో క్రైస్తవ మిషనరీలు పని చేస్తున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. వ్యక్తిగతంగా మతసామరస్యం పాటిస్తానని, ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని అందుకోసం పేద క్రైస్తవులకు చంద్రన్న క్రిస్మస్ కానుక ప్రారంభించినట్లు చెప్పారు. క్రైస్తవుల్లో పేదలు ఎక్కువగా ఉన్నారని, ఇందులో దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారని అందుకోసం వారికి దళితులతో సమానంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్నారు. క్రిస్టియన్ కార్పొరేషన్‌కు 70కోట్లు కేటాయించామని, పది కోట్లతో క్రిస్టియన్ భవన్ నిర్మస్తున్నామన్నారు. జెరుసలేం యత్రకు ప్రోత్సాహకంగా 25వేల నుంచి 40వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో చర్చిల నిర్మాణానికి, మరమత్తులకు లక్ష నుంచి 3 లక్షల వరకు నిధులు అందచేస్తామన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మాస్టర్ లైసెన్స్‌ల కోసం మీసావా కేంద్రాల ద్వారా జారీ చేసే అవకాశాలు పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు, అనంతరం రాష్ట్రంలో ఉత్తమసేవలు అందించిన క్రైస్తవులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈసందర్భంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రులు రావెల కిషోర్‌బాబు, దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాధ్, కొల్లు రవీంద్ర, మృణాళిని, డిజిపి సాంబశివరావు, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, మైనార్టీ కమిషనర్ ఇక్బాల్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు