ఆంధ్రప్రదేశ్‌

జనరంజకమే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 20: ‘విద్యార్థులకు ఏడాదికి ఒకసారి, రాజకీయ నాయకులకు ఐదేళ్లకు ఒకసారి పరీక్షలు వస్తాయి. నాకు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షలు వస్తాయి’ అని గతంలో కలెక్టర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారంనుంచి రెండు రోజులపాటు జరిగే జిల్లాల కలెక్టర్ల సమావేశంలో మొదటి అర్ధ సంవత్సరం పరీక్షా ఫలితాలను విశే్లషించనున్నారు. అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ సమీకరించి కొరత ఎదుర్కొంటున్న ఆయా శాఖలకు ప్రాధాన్యతాక్రమంలో అందిస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న బాబు, క్షేత్రస్థాయిలో నిర్ణయాల అమలు ఎలా ఉందో కలెక్టర్ల సమావేశంలో పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన వృద్ధిరేటును ఇటీవల విజయవాడ వచ్చిన రష్యన్ ఫెడరేషన్ మంత్రి డెనిస్ మంచురోవ్ సైతం కొనియాడిన విషయం తెలిసిందే. అయితే కేవలం వృద్ధిరేటుతో సరిపెట్టకుండా తన పాలన ప్రజలను సంతృప్తి పరిచేలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు వృద్ధిరేటు మరింత పైపైకి వెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంతోపాటు ప్రజల సంతృప్తి శాతం ఎంత ఉందో మదింపు చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలన తీరుపై ప్రజల్లో 80 శాతం సంతృప్తి ఉండాలన్నది బాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరానికి 16.42 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోగా 12.23 శాతం వృద్ధినే సాధించారు. దేశ వృద్ధిరేటు కన్నా ఇది 5 శాతం అధికమే అయినా అనుకున్న లక్ష్యసాధనలో వెనుకబడటానికి కరువు, పాలనా కేంద్రం తరలింపు వంటి అంశాలు కారణం. మొదటి అర్ధ సంవత్సరం ఫలితాలను విశే్లషించుకుని రెండో అర్ధ సంవత్సరంలో నిర్దేశించుకున్న 14.41 శాతం వృద్ధిని సాధించేందుకు ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
20, 21 తేదీల్లో మొత్తం ఎనిమిది సెషన్లుగా సాగే ఈ సమావేశాల్లో మొదటి సెషన్ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకర్షణీయ ఆర్ధిక వృద్ధికి తీసుకోవాల్సిన సంస్కరణలపై చర్చతో ప్రారంభమవుతుంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా స్వాగతోపన్యాసం చేయనున్నారు. జీవన భద్రత నుంచి ఆదాయ భద్రత వరకు కుటుంబ వికాసం కోసం నిర్దేశించుకున్న 15 సూత్రాలను, సమాజ వికాసం కోసం అమలుచేస్తున్న పది సూత్రాలను, సుస్థిరమైన అభివృద్ధికి ఎంచుకున్న 17 లక్ష్యాలపై బాబు ప్రసంగిస్తారు. జాతీయ పురస్కారాలు దక్కించుకున్న ఇంధనం, పరిశ్రమలు, జలవనరులు, రెవెన్యూ శాఖలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించనున్నారు. రెండో సెషన్లో నీటి నిర్వహణ, కరువు నివారణ, అమరావతి, గ్రామీణ పట్టణ వౌలిక సదుపాయాలపై చర్చ జరగనుంది. మూడో సెషన్‌లో ప్రాథమిక రంగంలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు అమలుచేయాలనే దానిపై ప్రస్తావించనున్నారు. చివరి సెషన్‌లో బలహీనవర్గాల సాధికారత కోసం సంక్షేమ పథకాల సమగ్ర అమలుపై చర్చతో మొదటిరోజు సమావేశాలు ముగియనున్నాయి. రెండోరోజు గురువారం ఆరోగ్యం, వ్యాధుల నివారణ, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, యువజన విధానం, విద్య, వయోజన విద్యలపై చర్చతో మొదటి సెషన్ ప్రారంభమవుతుంది. రెండో సెషన్‌లో ఇంధన, వౌలిక వసతులు, పరిశ్రమలు, అగ్రి బిజినెస్, రవాణా, పర్యాటకం, వర్తకం, ఐటీఈలపై అధికారులు తమ అనుభవాలను పంచుకోవడంతోపాటు రెండో అర్ధ సంవత్సరం అమలుచేసే కార్యాచరణను ప్రకటిస్తారు. మూడో సెషన్‌లో కలెక్టర్లు నిర్దేశిత వృద్ధిరేటు లక్ష్యాన్ని సాధించేందుకు అమలుచేయనున్న వ్యూహాన్ని విశదీకరిస్తారు. చివరి సెషన్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలపై సమీక్ష జరుపుతారు.