ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌సి బయో-226 పరిహారం ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: కోస్తా నేలల్లో కొత్త వరి వంగడంగా పరిచయమైన ఆర్‌సి బయో 226 రకం సాగుచేసి నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం అందలేదు. తుపాను గాలులకు తట్టుకుని ఒరిగిపోకుండా ఉంటుందని, దోమపోటు, ఆకు ముడత వంటి తెగుళ్లను తట్టుకుని, భరోసాగా దిగుబడి ఇస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు ఈ కొత్త వంగడాన్ని ఖరీఫ్ కాలంలో సాగుచేయించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఈస్ట్రన్ డెల్టా, మెట్ట ప్రాంతాల్లోని కొన్ని మండలాల్లో రైతులు ఈ రకం సాగుచేశారు. వ్యవసాయ శాఖ విత్తనాలపై కిలోకు ఐదు రూపాయల చొప్పున సబ్సిడీ కూడా ఇచ్చింది. రైతులకు ఎకరాకు 32 కిలోల చొప్పున ఆర్‌సి బయో-226 విత్తనాన్ని ఎపి సీడ్స్ సంస్థ సరఫరా చేసింది. ఈ మేరకు యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, గండేపల్లి, రాజమహేంద్రవరం రూరల్, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో సాగుచేశారు.. పైరు ఏపుగా పెరిగింది. గింజలు మాత్రం గట్టి పడలేదు. తప్ప..తాలు..పొల్లు గింజలతో కేళీ పంటగా మారింది. సంప్రదాయబద్ధంగా పండిస్తోన్న రకాలైతే ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి సాధిస్తే ఈ కొత్త ఆర్‌సి బయో 226 మాత్రం కేవలం ఎకరానికి 15 నుంచి 20 బస్తాలు మాత్రమే దక్కింది. ఈ విత్తనం దగా చేసిందని, పంటంతా కేళీలుగా మారిందని రైతులు ఆందోళనకు దిగడంతో ముందుగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వడంతో శాస్తవ్రేత్తల బృందం విచారణ జరిపింది. ఎపి సీడ్స్ సంస్థ నుంచి ప్రతినిధుల బృందం పరిశీలన జరిపి విత్తన సంస్థకు నోటీసులు జారీచేస్తూ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సూచిస్తూ ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది.