ఆంధ్రప్రదేశ్‌

2 నుంచి ‘దివ్య దర్శనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: హిందూమత పటిష్ఠానికి దేవాదాయ శాఖ చేపట్టిన వినూత్న పథకం ‘దివ్య దర్శనం’ జనవరి 2 నుంచి ప్రారంభం కానుంది. తొలివిడతగా ఇటు కృష్ణా నుంచి అటు శ్రీకాకుళం వరకు ఆరు జిల్లాల పరిధిలో ముందుగా ఈ పథకం అమలుచేయనున్నారు. విజయవాడలో జనవరి 2వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. దివ్య దర్శనం కార్యక్రమానికి ఒక్కో జిల్లా నుంచి పది వేల మందిని ఎంపికచేసి, తిరుమలతో పాటు ఆయా జిల్లాల్లోని మరో నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వివిధ సామాజికవర్గాల ప్రజలందరికీ ఈ దివ్య దర్శనం కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అందించనుంది. ఒక్కో కుటుంబ నుంచి ఐదుగురు చొప్పున జిల్లాకు పది వేల మందికి సర్వం ఉచితంగా సేవలు అందిస్తారు.