ఆంధ్రప్రదేశ్‌

అడ్డతీగల కోర్టుకు మావోయస్టు భూషణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డతీగల, డిసెంబర్ 20: ఎఒబి మావో దళంలో 2011 ముందు వరకు కీలక నేతగా ఉన్న చడ్డా భూషణం (పాత్రో) అలియాస్ నాగరాజును అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు మంగళవారం హాజరుపర్చారు. 2011 సంవత్సరంలో పోలీసులకు చిక్కిన ఈ మావోయిస్టు నేత ఎఒబి స్పెషల్ జోనల్ మిలటరీ కమిషన్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రా, ఒడిస్సా రాష్ట్రాల్లో 160 కేసులు వరకు భూషణంపై ఉన్నాయి. ఏజెన్సీలోని రాజవొమ్మంగి సర్కిల్‌లోని రాజవొమ్మంగి, జడ్డంగి పోలీసుస్టేషన్లలోను, అడ్డతీగల సర్కిల్‌లోని వై రామవరం, దుశ్చర్తి పోలీసుస్టేషన్లలోను నమోదైన 11 కేసుల్లో నిందితునిగా ఉన్న భూషణంను అడ్డతీగల కోర్టులో హాజరుపర్చారు. జిల్లాస్థాయి న్యాయస్ధానంలో విచారణ జరగాల్సిన కేసులు కావడంతో వాటిని బదిలీ చేయడానికి ముందుగా ఇక్కడి కోర్టులో వాయిదాకు హాజరుపర్చినట్టు అడ్డతీగల సిఐ ముక్తేశ్వరరావు తెలిపారు.