ఆంధ్రప్రదేశ్‌

టిడిపి సంస్థాగత ఎన్నికల షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 20: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. విజయవాడలో మంగళవారం జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్‌లో ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. రానున్న జనవరి 23 నుంచి 30 వరకూ గ్రామ/మున్సిపల్ వార్డు కమిటీల ఎన్నికల అధికారుల ఎంపిక, ఫిబ్రవరి 3 నుంచి 6 వరకూ గ్రామ/మున్సిపల్ వార్డు కమిటీల ఎన్నికలు, మార్చి 1 నుంచి 6వ తేదీ వరకూ మండల/పట్టణ/డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీల ప్రతినిధుల జాబితా తయారు, మండల ఎన్నికల అధికారుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మార్చి 10 నుంచి 12 వరకూ మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నిక కమిటీ అధికారులకు శిక్షణ(రాష్ట్ర కార్యాలయంలో), మార్చి 19 నుంచి ఏప్రిల్ 5 వరకూ మండల, పట్టణ, డివిజన్ కమిటీలకు ఎన్నికలు, ఏప్రిల్ 21 నుంచి 28 వరకూ జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ కమిటీల ఎన్నికలు, మే 11 నుంచి 23 వరకూ జిల్లాల్లో మినీ మహానాడులు, మే 27 నుంచి 29 వరకూ మహానాడు నిర్వహిస్తారు. అక్కడ జాతీయ కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తారు.