ఆంధ్రప్రదేశ్‌

వెలగపూడికి తరలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 20: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆనాలోచితంగా తీసుకొన్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని, నోటుకు పాట్లు పడుతున్న ప్రజల కష్టాలను తీర్చడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, ఆయా చర్యలను సమర్ధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పాలకులను పార్టీల రహితంగా రూపొందించిన ప్రశ్నిద్దాం రండి.. అనే ప్రజాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎపిసిసి కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో నిర్వహించిన సమీక్షలో తొలుత డిసెంబర్ 23 ఛలో వెలగపూడి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ ప్రజాధానిగా చెప్పుకొంటున్న వెలగపూడి సచివాలయం ఏర్పాటైన తరువాత జరుగుతున్న తొలి ప్రజాధర్నాను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈధర్నాలో టిడిపి, బిజెపి లు మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. నోట్లపాట్లకు గురైన బాధితులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న విషయం చాటిచెప్పాలన్నారు. దేశంలో నల్లధనం, అవినీతి, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదం నిర్మూలన పేరుతో ప్రధాని తీసుకొన్న చర్యలు అప్రజాస్వామికమన్నారు. ఈనెల 12న కాంగ్రెస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 36రంగాలకు చెందిన చిన్న, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, పెన్షన్ దారులు, జర్నలిస్టులు పాల్గొని తమ కష్టాలను ప్రశ్నల రూపంలో మొరపెట్టిన అంశాలే రేపటి ప్రజాధర్నాకు ప్రధాన అంజెండాగా ఉంటుందని రఘువీరారెడ్డి తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ తీరును రఘువీరారెడ్డి ఖండించారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరిట ప్రజలు, రైతులు, కాంగ్రెస్ నేతలు చట్టపరమైన పోలీస్ అనుమతులతో చేపట్టిన రైతు సదస్సు వెళ్తున్న నేతలను అడ్డుకొని అరెస్టు చేయడం దారుణమన్నారు. సిఎం చంద్రబాబు చేసిన ఫోన్ కాల్‌తోనే నేతల అరెస్టులు జరిగాయన్న వినిపిస్తున్న విమర్శలు హేయమన్నారు. ఈసమావేశంలో ఎపిసిసి ఉపాధ్యక్షులు ఎంజె రత్నకుమార్, ఫ్రధాన కార్యదర్శి టిజెఆర్ సుధాకర్‌బాబు, మీసాల రాజేశ్వరరావు, ఆకుల శ్రీనివాస్, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.