ఆంధ్రప్రదేశ్‌

తొలి నగదు రహిత గ్రామం ధర్మసాగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం(టౌన్), డిసెంబర్ 20: నగదు రహిత లావాదేవీలను పూర్తిగా అమలు చేయడంలో విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం పెనుమార్పుకు శ్రీకారం చుట్టనుందని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన ప్రశంసించారు. ఈ చిన్న గ్రామంలో తీసుకున్న నిర్ణయం చాలా పెద్దదిగా పేర్కొన్నారు. మంగళవారం ఆమె గ్రామాన్ని సందర్శించి నగదు రహిత గ్రామంగా రూపొందేందుకు తీసుకున్న చర్యలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ఈ మార్పు అభివృద్ధికి సంకేతమన్నారు. బ్యాంకు ఖాతాల ద్వారా నగదు బదిలీ చేస్తూ కిరాణా, పాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. వ్యవసాయ కార్మికుల వేతనాలు కూడా రైతులు ఖాతాల ద్వారా వారి ఖాతాలకు బదిలీ చేయడం చూస్తుంటే గ్రామీణ భారతంలో సాంకేతికత ఫలాలు వస్తున్నాయని తెలుస్తోందన్నారు. ఇదంతా గ్రామస్థుల ఉత్సాహం, అధికారుల కృషితోనే సాధ్యమయిందన్నారు. ఈ విషయం కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్థానిక యువకులకు శిక్షణ ఇచ్చి, గ్రామస్థులకు అవగాహన కల్పించి నగదు రహిత గ్రామాన్ని సాధించడంలో సహాయ కలెక్టర్ సాయి కాంత్ వర్మను ఆమె ప్రశంసించారు. ఆంధ్రా బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల కృషి ఫలితంగానే ధర్మసాగరం నగదు రహిత లావాదేవీలు జరిపేవిగా రూపొందించడంలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సహాయ కలెక్టర్ సాయికాంత వర్మ మాట్లాడుతూ గ్రామాన్ని నగదు రహిత లావాదేవీలపైవు మళ్లించేందుకు చేప్టిన చర్యలను వివరించారు. గ్రామంలో 29 మంది యువకులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఇంటికి ఒకరికి అవాహన కల్పించామన్నారు. త్వరలో ఆటోలను కూడా నగదు రహితంగా మార్పు చేస్తామని చెప్పారు. ఎంపిపి సుకల రమణమ్మ స్వాగతం పలికి తమ గ్రామానికి ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి అధికారులు కృషి ఫలితమేనని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో సూర్యారావు, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ సుధాకర్, తహశీల్దార్ వివి రమణ, ఎంపిడిఓ జానకిరావు పాల్గొన్నారు.

చిత్రం..జెసి సృజన