ఆంధ్రప్రదేశ్‌

ఒఎన్జీసీ పైపులైను నుంచి క్రూడాయిల్ లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, డిసెంబర్ 20: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి ఒఎన్‌జిసి వెస్ట్ స్ట్రక్చర్ పరిధిలోని తూర్పుపాలెం ఎడబ్ల్యూబిహెచ్ సైట్ నుండి కెడబ్ల్యూఎఎ సైట్‌కు అనుసంధానం చేసిన పైప్‌లైను నుండి మంగళవారం భారీఎత్తున క్రూడాయిలు లీకయ్యింది. దాదాపు యాభై మీటర్ల మేర ఎత్తుకు క్రూడాయిలు ఎగసిపడటంతో స్థానిక రైతాంగం ఆందోళనకు గురయ్యింది. ఉదయం 8.30 గంటల సమయంలో పొలం పనులకు వెళ్లే రైతాంగం లీకేజీని గమనించి సమీపంలో ఉన్న ఒఎన్‌జిసి సైట్ సిబ్బందికి సమాచారం అందించారు. దీనితో వారు రంగంలోకి దిగి అదుపుచేశారు. కాగా క్రూడాయిలు ఒత్తిడికి రోడ్డుపక్కన ఉన్న సర్వి వృక్షాలు విరిగిపడిపోయాయి. దాదాపు 25 ఎకరాల్లో సరుగుడు పంటకు ఈ లీకేజీ కారణంగా నష్టం వాటిల్లిందని సిసిఎఫ్ సొసైటీకి చెందిన రైతులు నల్లి అంబేద్కర్, గంటా వరప్రసాద్, బొడపాటి ఆశీర్వాదం, గంటా ఆశీర్వాదం ఆవేదన వ్యక్తంచేశారు. సర్వి తోటలకు నీటిని సరఫరాచేసే బోదుల ద్వారా క్రూడాయిలు 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రవహించిందని రైతులు పేర్కొన్నారు.