ఆంధ్రప్రదేశ్‌

‘ఆన్‌లైన్’లోకి రాలేరా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 22: ఆన్‌లైన్‌లో లావాదేవీల విషయంలో ఐఎఎస్ అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఆధార్ ఆధారిత, నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా బందర్ రోడ్డులో చాలా దుకాణాల్లో ఈ-పోస్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విధానంలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు వెళ్లి కొన్ని కొనుగోళ్లు చేసి, తమ అనుభవాలను గురువారం తనకు తెలియచేయాలన్నారు. ఈమేరకు చాలామంది మంత్రులు, కొందరు ఐఎఎస్ అధికారులు బుధవారం రాత్రి కొనుగోళ్లు చేశారు. గురువారం ఉదయం సదస్సు ప్రారంభంలోనే ‘నిన్న ఎంతమంది ఆధార్ ఆధారిత విధానంలో కొనుగోళ్లు చేశారో చేతులెత్తాల’ని చంద్రబాబు కోరారు. కొందరు మంత్రులు, కొందరు ఐఎఎస్ అధికారులే చేతులెత్తటంపై ముఖ్యమంత్రి అసహనానికి గురయ్యారు. తాను 40 రోజులుగా పెద్దనోట్ల రద్దు సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తుంటే, ఇక్కడ ఉన్నవారిలో 40 శాతం మంది కూడా ఈ విధానాన్ని పరిశీలించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు తమ అనుభవాలు తెలిపారు. తాను ఆధార్ సీడింగ్ చేసేందుకు ప్రయత్నించగా, సీడింగ్ కాలేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తాను ఒక షాపులో పెన్ను కొనగా డబ్బు తన ఖాతా నుంచి డెబిట్ ఐనట్లు మెసేజ్ రాలేదని ఐఎఎస్ అధికారి ఉదయలక్ష్మి తెలిపారు. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐదు ఈ-పోస్ మిషన్లలో నాలుగు పనిచేయడం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మరో అధికారి ఎంకె మీనా ఐసిఐసిఐ బ్యాంక్ ఆన్‌లైన్ లావాదేవీలు సరిగా పనిచేయటం లేదని తెలిపారు.