ఆంధ్రప్రదేశ్‌

ఇరాన్‌లో బొబ్బిలివాసుల ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, డిసెంబర్ 22:ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఇరాన్‌కు వెళ్లిన బొబ్బిలికి చెందిన కొంతమంది కూలీలు పరాయి దేశంలో పని దొరక్క, తిండీ తిప్పలు లేక అల్లాడుతున్న వైనం వెలుగు చూసింది. బొబ్బిలి మండలం పిరిడి, రంగరాయపురం, చెల్లారుపువలస గ్రామాలకు చెందిన కొంతమంది కష్టజీవులు నాలుగు నెలల క్రితం ఉపాధి వెతుక్కుంటూ ఇరాన్ వెళ్లారు. గోర్జి వేణుగోపాల్, చెల్లారపు భాస్కరరావు, పప్పల తిరుపతిరావు, అచ్యుతరావు, సిహెచ్ సింహాచలం, వై శ్రీనివాసరావు, వై భాస్కరరావుఇరాన్ వెళ్లినవారిలో ఉన్నారు. అక్కడ పరిశ్రమల్లో వెల్డర్లుగా పని చేస్తున్నారు. కాగా అక్కడ పరిస్థితి ప్రతికూలించి, ఒక్కసారిగా ఈ పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో ఉపాధి లేక వీరంతా రోడ్డున పడ్డారు. ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో కూలీలు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు పాస్‌పోర్టులు లేకపోవడంతో రాలేని పరిస్థితి నెలకొంది. తమ వారు అక్కడ ఎలా ఉన్నారోనని గ్రామానికి చెందిన బాధితుల కుటుంబీకులు వాపోతున్నారు. చెల్లారపు భాస్కరరావు భార్య పార్వతి, కుమారుడు రాంబాబు, కుమార్తె సంతోషిణి, వృద్ధురాలైన తల్లి నారాయణమ్మ కన్నీటి పర్యంతమవుతున్నారు. రంగరాయపురం గ్రామానికి సోదరులు పప్పల తిరుపతిరావు, అచ్యుతరావు తల్లిదండ్రులు, భార్యపిల్లలు అన్నదమ్ముల రాకకోసం ఎదురు చూస్తున్నారు.
‘కేంద్రంతో మాట్లాడతాం’
విజయనగరం: ఇరాన్‌లో చిక్కుబడిన కూలీలను మన దేశానికి తీసుకువస్తామని మంత్రులు మృణాళిని, పల్లె రఘునాథరెడ్డి హామీ ఇచ్చారు. ఇరాన్‌లో 11 మంది కూలీలు చిక్కుకున్నారని, అక్కడ ఫ్యాక్టరీ మూసివేయడంతో వీరంతా తినడానికి తిండి లేక ఇక్కట్లు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి అక్కడి వారిని తిరిగి స్వదేశానికి తీసుకువస్తామని మంత్రులు స్పష్టం చేశారు.