ఆంధ్రప్రదేశ్‌

ఎసిబి వలలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 22: ప్రకాశం జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖాధికారులపై అవినీతి నిరోధక శాఖాధికారులు ఏకకాలంలో గురువారం ముమ్మర దాడులు చేశారు. ఒంగోలు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇఇ మెండు వెంకటేశ్వర్లు, చీరాలకు చెందిన పంచాయతీరాజ్ జూనియర్ ఇంజనీరు కట్టా ఏలిషా కాంట్రాక్టర్ల వద్ద లంచాలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
పంగులూరు మండలం జనకవరం నేషనల్ హైవే పక్కన ఏడు కిలోమీటర్లు రోడ్డును 2.90 కోట్ల రూపాయల వ్యయంతో స్నేహ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టరు మలినేని రవీంద్రబాబు చేపడుతున్నారు. ఈనేపధ్యంలో 2.90 కోట్ల రూపాయల బిల్లులు చేసేందుకు లక్ష రూపాయలను డిమాండ్ చేయటంతో ఆ కాంట్రాక్టరు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఎసిబి అధికారులు వలపన్ని అతన్ని పట్టుకున్నారు. అదేవిధంగా చీరాలలోని పంచాయతీరాజ్‌శాఖకు చెందిన జూనియర్ ఇంజనీరు కట్టా ఏలిషా అదే కంపెనీకి చెందిన బొడ్డు వెంకటేశ్వరరావు నుంచి ఎనిమిది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. ఇదిలావుండగా నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు 30 వేలు లంచం డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో ఏఇని ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దగదర్తి మండలం సిద్దారెడ్డిపాలెం, తిమ్మారెడ్డిపాలెం గ్రామాలలో వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు గతంలో చోరీకి గురికాగా వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు విద్యుత్ అధికారి 30వేలు ఇవ్వాలని రైతులను వేధించసాగాడు. దీనిపై రైతులు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం రైతుల నుంచి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హెండెడ్‌గా పట్టుకున్నారు.