ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి అపురూప నృత్య సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 22: వందల సంవత్సరాల చరిత్ర.. లక్షలాది మంది కళాకారుల కృషి.. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన తెలుగువారి ప్రాచీన నృత్య కళాతోరణం కూచిపూడి నాట్యం మరోసారి తన సత్తాను ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు సిద్ధమయింది.
ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా మన కూచిపూడి నృత్య వనె్నతగ్గని వైభవం ఆకర్షిస్తుంది. ఇలాంటి వైభవం సొంతం చేసుకున్న మన కూచిపూడి నృత్యాన్ని మరోసారి అద్భుతంగా ప్రదర్శించేందుకు నాట్యాచార్యులు, కళాకారులు ఒకే వేదిక పైకి రానున్నారు. నేటి నుంచి మూడురోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనానికి అమరావతి వేదిక కానుంది. నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మూడురోజులు నిర్వహించే ఈ వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 8గంటలకు శోభాయాత్రతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ప్రారంభమయ్యే వేడుకల్లో నాట్య కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రెండోరోజు పలువురు ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. చివరిరోజు ఆదివారం సాయంత్రం 15 నిముషాల పాటు మహానాట్య బృంద ప్రదర్శన ఏడువేల మందితో జరగనుంది. ఈ వేడుకల కోసం స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 300 మంది కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చేలా వేదికను సిద్ధం చేశారు. ఈ వేడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు నాట్యరంగంలో పేరొందిన నాట్యాచార్యులు స్వప్నసుందరి పద్మశ్రీ శోభానాయుడు, పద్మశ్రీ జయరామారావు, కళారత్న బాలకొండలరావు, పద్మజారెడ్డి, పనుమర్తి శేషుబాబు, కృష్ణశర్మ, రాధారెడ్డి వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 బృందాలు నాట్య ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. కూచిపూడి నాట్యారామ ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ ఆధ్వర్యంలో ఈ వేడుక కార్యక్రమం రూపుదిద్దుకుంది.