ఆంధ్రప్రదేశ్‌

24న ఫ్లెమింగో కవితోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 22: నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సులో విదేశీ పక్షులను తిలకించే ఉద్దేశంతో ఈనెల 27నుంచి మూడురోజులపాటు ఫ్లెమింగ్ ఫెస్టివల్ పేరిట ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. అరుదైన విదేశీ పక్షులు పులికాట్ సరస్సు కేంద్రంగా సూళ్లూరుపేట, నేలపట్టు తదితర ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటుచేసుకుని పులికాట్ సరస్సులో చేపలవేట అనంతరం సంతానోత్పత్తి తర్వాత స్వస్థలాలకు వెళ్లడం ఎన్నో ఏళ్లనుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈనేపధ్యంలో విదేశీ పక్షులను చూడడానికి వచ్చే వారిని ఆకట్టుకునేలా వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆటలు, వక్తృత్వం, వ్యాసరచన పోటీలే కాకుండా దక్షిణ భారత దేశంలో ఉండే అన్ని భాషలకు చెందిన కవులను ఒక చోట చేర్చి కవిసమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో వలస పక్షులు అనే కవితాంశంపై రాష్ట్ర పర్యాటక సంస్థ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, పెన్‌ఇండియా (కలకత్తా) సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 24న దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 8 భాషల్లో కవి సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించాయని కవిసమ్మేళనం నిర్వాహకుడు, ప్రముఖ కవి పెరుగురామకృష్ణ చెప్పారు. ఈకవిసమ్మేళనంలో తెలుగు, ఆంగ్ల,సంస్కృతం, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో లబ్ధ ప్రతిష్టులైన కవులు తమ కవితల్ని వినిపిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా వలస పక్షుల పండగ, వలస పక్షులు అనే అంశంపై నెల్లూరు రచయితలు రాసిన మూడు పుస్తకాలను ఆవిష్కరిస్తామన్నారు.