ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థినుల నీటి కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందుర్పి, డిసెంబర్ 22: ఒకరి పక్కన ఒకరు నిలుచుని నీళ్ల బిందెలు, బక్కెట్లు అందుకుంటున్న ఈ బాలికలు అనంతపురం జిల్లా కుందుర్పిలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు. నాలుగురోజుల క్రితం పాఠశాలలో బోర్ పాడవడంతో నీటికి కటకట ఏర్పడింది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక వీరంతా ఇలా అరకిలోమీటరు దూరంలోని ట్యాంకు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. పాఠశాలలోని 210 మంది విద్యార్థినులు శ్రీరామిరెడ్డి ట్యాంకు నుంచి పాఠశాల వరకూ వరుసగా నిలుచుని బిందెలు, బక్కెట్లలో నీళ్లు తెచ్చుకున్నారు. చక్కగా చదువుకోవాల్సిన పిల్లలు నీళ్ల కోసం ఇలా రోడ్డునపడడం పలువురిని కలచివేస్తోంది.

చిత్రం..కుందుర్పి కస్తూరిబా గురుకుల పాఠశాల
విద్యార్థినులు నీళ్ల బిందెలు, బకెట్లు అందుకుంటున్న దృశ్యం