ఆంధ్రప్రదేశ్‌

రావెల రూటే సెపరేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 23: రావెల కిశోర్‌బాబు.. రైల్వే అధికారి నుంచి రాజకీయ నేతగా అవతారమెత్తి, తొలి పోటీతోనే మంత్రి పదవి పొందినవారు. కొత్తగా పార్టీలో చేరి మంత్రి పదవి పొందిన ఆయన తీరు ఆ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నా, నాయకత్వం ఉపేక్షించడంపై జిల్లా నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయన యువనేత పేరుచెప్పి ఉనికి కొనసాగిస్తున్నారనే ఆరోపణలు నాయకత్వం దృష్టివరకూ వెళ్లినా వౌనంగా ఉండటం పార్టీకి చేటు తెస్తోందంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రావెలకు దళిత క్రైస్తవ కార్డుతో పదవి లభించినా, ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. సొంత నియోజకవర్గం నేతలనే ఇప్పటివరకూ గుర్తుపట్టరని, నేతలు వెళితే అవమానకరంగా మాట్లాడతారని, మాట్లాడే తీరు ఎవరికైనా ఆగ్రహం తెప్పిస్తోందనీ అంటున్నారు. తొలుత తన నియోజకవర్గంలో కాపులు అధికంగా ఉండే మండలానికి చెందిన ఎంపిపి తోట మల్లీశ్వరి మంత్రి వ్యవహార శైలికి నిరసనగా ఏకంగా నిరాహార దీక్ష చేసిన వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది. మంత్రి తన మండలంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తనను అవమానిస్తున్నారంటూ ఆమె దీక్ష నిర్వహించగా, నాయకత్వం ఆ వ్యవహారాన్ని సర్దుబాటు చేసింది. అయితే ఆ వ్యవహారం కాపులను ఆయనకు దూరం చేసింది. తర్వాత ఇటీవల జరిగిన జనచైతన్య యాత్రల్లో భాగంగా కమ్మ వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న వింజనంపాడు గ్రామానికి వెళ్లిన రావెల.. అక్కడున్న ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలకు పూలదండ వేయకుండానే వెనక్కి వెళ్లడం కమ్మవర్గ ఆగ్రహానికి గురయింది. మంత్రి నియోజకవర్గమైన పత్తిపాడు ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ రూరల్‌లో కాపు, మండలాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. ఇప్పుడు ఆయన ఆ రెండు వర్గాలవారినీ దూరం చేసుకున్నారు. తర్వాత పత్తిపాడు మండలంలోని బొర్రావారిపాలెంలోని ఎస్టీలు తమకు పట్టాలివ్వాలని రెండేళ్ల నుంచి మంత్రి చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించలేదు. దాంతో వారు ఇటీవల సీఎం చంద్రబాబును కలసి వేడుకోగా బాబు స్పందించి పట్టాలిప్పిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రిని కలిసిన ఎస్టీలపై రావెల మండిపడి ‘గెటౌట్! సిఎం దగ్గరకు వెళ్లారుగా. ఆయనతోనే ఇప్పించుకోండ’న్నట్లు మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి.