ఆంధ్రప్రదేశ్‌

ప్రైవేటు బిఇడి కాలేజీల ఫీజును నిర్ణయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: ఈ ఏడాదితో కలిపి వచ్చే మూడేళ్లకు 2018-19 సంవత్సరం వరకు ప్రైవేట్ బిఇడి కాలేజీల ప్రవేశానికి ఫీజును నిర్ణయించాలని హైకోర్టు శుక్రవారం ఏపి ఫీజు రెగ్యులేషన్ కమిషన్‌ను ఆదేశించింది. ఏపిఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఫీజును నిర్ధారించకపోవడాన్ని సవాలు చేస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీ యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పి నవీన్ రావువిచారించారు. తాము నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులను అప్‌లోడ్ చేశామని,కాని ఫీజును నిర్ధారించలేదని యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఫీజు వసూలు చేయకుండా విద్యార్ధులను కోర్సులో ఎలా చేర్చుకుంటామని వారుపేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని విద్యార్ధులు మూడు వాయిదాల్లో ఫీజులు చెల్లించేందుకు అనుమతించాలని ప్రైవేట్ యాజమాన్యాలను ఆదేశించింది. విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే అంశంతో కాలేజీ ఫీజులను అనుసంధానం చేయరాదన్నారు. కాలేజీ యాజమాన్యాలు దరఖాస్తుతో పాటు రూ.50 వేల ఫీజును , ప్రోసెసింగ్ ఫీజును కలిపి చెల్లించాలని ఆదేశించింది. నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి కాలేజీలు వ్యవహరించకపోతే పెనాల్టీని విధించే అధికారం కమిషన్‌కు ఉందని కోర్టు పేర్కొంది.