ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమి కమిటీలతో తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 23: ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల అమలుతీరును పర్యవేక్షించేందుకు జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేస్తే తమిటి? అంటూ ప్రతిపక్షాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల తరహాలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో అదనంగా ఇద్దరు డ్వాక్రా మహిళను, ఇద్దరు ఎన్జీవోలను, స్థానిక ఎంపిటిసి సభ్యుని నియమించామని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల అమలుతీరును జన్మభూమి కమిటీలు పర్యవేక్షిస్తాయన్నారు. దీనివల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుందన్నారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు న్యాయమైనప్పుడు, జన్మభూమి కమిటీల ఏర్పాటు అన్యాయం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. సర్పంచ్‌ల హక్కులను తాము హరించడం లేదని స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 1480 కోట్ల రూపాయలను ఇటీవల నేరుగా పంచాయతీలకే విడుదల చేశామని గుర్తుచేశారు.