ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబువి హత్యారాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 25: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇక గత 20ఏళ్లుగా పులివెందుల నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్ హత్యలు జరగలేదని, అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం అలవలపాడు గ్రామంలో వైకాపాకు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామిరెడ్డిని టిడిపి నేతలు హత్య చేశారని ధ్వజమెత్తారు. జగన్ ఆదివారం పులివెందుల, కమలాపురం, కడప నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఇటీవల హత్యకు గురైన అలవలపాడు వైకాపా నేత రామిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ విలేఖరులతో మాట్లాడుతూ రామిరెడ్డి రాజకీయంగా ఎదుగుతుండడం, అలవలపాడు గ్రామం మొత్తం వైకాపా అభిమానులు ఉండటాన్ని ఓర్వలేక సిఎం చంద్రబాబు అజమాయిషీ చేసి స్థానిక టిడిపి నేతలను ప్రోత్సహించి రామిరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోలేని టిడిపి ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అలాంటి టిడిపి నేతలు తమ పార్టీపై, తమ నాయకులపై ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ఏ ఒక్కరూ ఎదగలేరని, ఏ పార్టీ ముందుకురాదని ఆయన హితబోధ చేశారు.
అంతకుముందు పులివెందుల సిఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక వైకాపా నేతలతో మాట్లాడుతూ ఏసు ప్రభువు తమ వెంట ఉన్నారని, కొంతకాలం ఓపిక పడితే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతవరకూ టిడిపి నేతల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ ప్రతిఒక్కరూ ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఇక కృష్ణాజలాలను పులివెందులకు తెప్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ విషయమై సోమవారం పులివెందులలో చేపట్టే ధర్నా ద్వారా బాబు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో నీటి ఎద్దడి నెలకొని పండ్లతోటలు ఎండిపోతున్నాయని కావున పండ్లతోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా పని చేయిస్తామని స్పష్టం చేశారు. జగన్‌తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాథ్‌రెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబు, ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్‌రెడ్డి, పి.రవీంద్రనాధరెడ్డి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం..ఇటీవల హత్యకు గురైన రామిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న వైకాపా అధినేత జగన్