ఆంధ్రప్రదేశ్‌

3800 ఆలయాల్లో స్వైపింగ్ యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 25: రాష్ట్రంలోని వివిధ స్థాయిల్లో ఉన్న 3800 దేవాలయాల్లో భక్తుల సౌకర్యార్ధం స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఇప్పటివరకు 180 ప్రముఖ దేవాలయాల్లో ఈ యంత్రాలను సిద్ధంచేశామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బధిర పాఠశాలలో ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం సేవా టిక్కెట్లకు వీటిని ఉపయోగిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో అన్ని సేవలను ఆన్‌లైన్ చేస్తామని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, నగదు చెలామణీ స్థానంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ఆయన ప్రకటించారన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నగదు రహిత కార్యకలాపాలు చేయాలని ముందుకు వెళుతోందన్నారు. నవంబర్ 8వ తేదీన ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించారని, అప్పటి నుంచి దేవాలయాల హుండీల్లో నల్లధనం వచ్చి చేరుతుందన్నారని, అయితే అవన్నీ వట్టిదేనని తేలిందన్నారు. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం, ద్వారకాతిరుమల దేవస్థానాల్లో జరిగిన హుండీ లెక్కింపుల్లో అన్నీ చిన్న నోట్లే వచ్చాయని, ఎప్పుడూ వచ్చే విధంగానే పెద్ద నోట్లు వచ్చాయన్నారు. నోట్ల రద్దు తర్వాత తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తుల రద్దీ ఎప్పుడూ మాదిరిగానే ఉందన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నదానిలో వాస్తవం లేదన్నారు. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఎటిఎంల వద్దకు వెళ్లానని, అక్కడ ఎటిఎంలో క్యాష్ ఉంది కాని, క్యూలైన్లు లేవన్నారు. టిటిడి నిర్వహిస్తున్న బధిర పాఠశాలను కళాశాల స్థాయికి పెంచాలని ఇక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని, కచ్చితంగా కళాశాల స్థాయికి బధిర పాఠశాలను తీసుకువెళ్తానని మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు.

చిత్రం..వాజపేయి జన్మదిన వేడుకల్లో భాగంగా బధిర పాఠశాల విద్యార్థినితో కేక్ కట్ చేయిస్తున్న మంత్రి మాణిక్యాలరావు