ఆంధ్రప్రదేశ్‌

ప్రక్షాళన దిశగా పౌరసరఫరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 25: రాష్ట్రంలో పౌరసరఫరాల వ్యవస్థను మరింత ప్రక్షాళన చేసేందుకు దిశగా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ- పాస్ విధానం ద్వారా ఇప్పటికే సరకుల పంపిణీలో మార్పులు తీసుకువచ్చినప్పటికీ, మరిన్ని లోపాలను గుర్తించి నిరోధించే పనిలో అధికార యం త్రాంగం నిమగ్నమైంది. స్మార్ట్ పల్స్ సర్వేకు, కార్డులదారుల మధ్య 29 ల క్షల యూనిట్లు తేడా రావడం, వాహనా ల ట్రాకింగ్ వంటి అంశాలపై దృష్టి సా రించారు. రాష్ట్రంలో దాదాపు 1.32 కోట్ల మేరకు రేషన్ కార్డులు ఉండగా, వీటికి 29503 రేషన్ దుకాణాల ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నారు. సరకుల పంపిణీలో అవకతవకలు నిరోధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చ ర్యలు తీసుకుంటోంది. తొలిదశలో స ర్వే చేసి ఏరివేయగా, మలివిడతలో ఈ-పోస్ యంత్రాలను వినియోగంలోకి తీసుకువచ్చింది. దీంతో కొంతవరకూ అవకతవకలను నిరోధించగలిగారు. కానీ ఇంకా రేషన్ పంపిణీలో అవకతవకలు, లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్మార్ట్ పల్స్ సర్వేలో సేకరించిన కార్డుల వివరాల ను, వినియోగంలో ఉన్న రేషన్ కా ర్డుల వివరాలతో పోలిస్తే, 29 లక్షల యూనిట్ల వివరాలు మ్యాచ్ కావడం లేదు. ఇం దులో చాలా వరకూ రెండు చోట్ల కార్డుల్లో పేరు ఉండటం లేదా చనిపోవ డం వంటివి కారణాలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. యూనిట్ల సం ఖ్యలో భారీ సంఖ్యలో తేడా ఉండటం తో మరోసారి క్షేత్ర పరిశీలన చేసి, పేర్లను తొలగించనున్నారు. ఈ-పాస్ యంత్రాలను ఏర్పా టు చేసినప్పటికీ, సరకుల పంపిణీలో అక్రమా లు జరుగుతున్నట్లు గుర్తించారు. ఒక కార్డుదారునికి రేషన్ పంపిణీకి కనీసం 1 ని మిషం సమయం పట్టాల్సి ఉం డగా, కేవలం 20 సెకన్లలో పంపిణీ ప్ర క్రియ ముగించడం అధికారుల దృష్టికి వచ్చి ంది. తక్కువ సమయంలో ముగిసిన రేషన్ దుకాణాలపై మరింత నిఘా పెంచనున్నారు. గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరకును రవాణా చేసే వాహనాలను కూడా జిపిఎస్‌కు అనుసంధానం చేసే యోజన పరిశీలనలో ఉంది. దీంతో వాహనాల ద్వారా రవాణాపై నిఘా పెట్టేందుకు వీలు అవుతుంది. వాహనం నిర్దేశిత రూట్‌లో కా కుండా దారి మ ళ్లితే, అందుకు సంబంధించిన అలెర్టు ఎస్‌ఎంఎస్ కొంతమంది అధికార్లకు అం దేలా ప్రతిపాదిస్తున్నారు. ఇవి కా కుం డా తూకం రాళ్లు, తూ నిక పాత్రల సీ ళ్లు కూడా తొలగించడం, అనుమతించని తూకం రాళ్లు, పాత్రలు, ట్రాన్‌సాక్షన్‌కు సంబంధించిన రశీదు ఇవ్వకపోవడం, లావాదేవీ ముగిసినట్లుగా వినిపించే అలారాన్ని పని చేయించకపోవడం, కిరోసిన్ తీ సుకోకపోయినా, మరో సరకుతో కలి పి తీసుకున్నట్లుగా నమోదు చేయడం వంటి అంశాలు అ ధికారుల దృష్టికి వచ్చాయి. రేషన్ దు కాణాల్లో ఇందుకు సంబంధించిన అం శాలను ప్రదర్శించే లా బోర్డుల ఏర్పా టు ప్రతిపాదన పరిశీలనలో ఉంది. పౌరసరఫరాలకు సంబంధించి వివిధ అంశాలపై ఒక ఎఇపిడిఎస్ పేరుతో ఒక యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా మరింత పారదర్శకంగా సరకుల పంపిణీ జరగడమే కాకుండా, అక్రమాలు నివారించే వీలు ఉంటుందని భావిస్తున్నారు.

విజయవాడపై కాలుష్య మేఘాలు

స్వచ్ఛ నగరంపై సర్కారు కల నెరవేరేనా!

విజయవాడ, డిసెంబర్ 25: భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం వాతావరణ కాలుష్యంపైనే ముందెన్నడూ లేని రీతిలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణా శాసనసభ సమావేశాల్లో ఇదే అంశంపై గంటల తరబడి చర్చ జరగడమే గాక విపక్షాల ఆరోపణలు శాసనసభనే కుదుపేసాయి. పర్యావరణ పరిరక్షణ పేరిట పవిత్ర వినాయకచవితి రోజున రంగురంగుల వినాయకుల ప్రతిమల వినియోగానికి అలాగే ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ వినియోగానికి సైతం ప్రజలు తమంతట తాము స్వస్తి చెబుతున్నారు. అయినప్పటికీ సిఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనే సభలు, సమావేశాల్లో ఒకటి రెండు కాదు కిలోమీటరు మేర అడుగడుగునా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నా యి. ఒకటి రెండు రోజుల తర్వాత అవి ఎక్కడికక్క డ మట్టిలో కలుస్తున్నాయి. ఇదిలావుంటే చంద్రబా బు శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికం గా పర్యటిస్తూ విజయవాడ నగరాన్ని కాలుష్య రహి త నగరంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అలాగే ముందుగా ప్రజారోగ్య రక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు గా పదేపదే చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రపంచానికే కాలుష్యం పెనుముప్పుగా పరిణమిస్తుంటే అందులో రాజధాని విజయవాడ నగరం కూడా ఎందులోనూ తీసిపోవడం లేదు. విజయవాడ నగరంలో వాతావరణ కాలుష్యం రోజురోజుకీ పెరుగుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత గత రెండున్నర సంవత్సరాల కాలంలో విజయవాడలో వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. ఇక నగరంలో ప్రధానంగా ఏలూరు, బందరు రోడ్లు మాత్రమే వున్నాయి. ఎవరు ఎటు నుంచి వెళ్లినా ఖచ్చితంగా ఈ రెండు మార్గాల్లోనే ఎక్కడో ఒకచోట కలవాల్సిందే. అలాంటిది ఏకంగా సిఎం క్యాంప్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర డిజిపి, ఇతర రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కావటంతో వివిధ పనుల మీద నగరాన్ని సందర్శించేవారి సంఖ్య అనూహ్యరీతిలో పెరుగుతూ వస్తున్నది. దీంతో వాయు, ఇంధన కాలుష్యాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక నగరం నడిబొడ్డు నుం చే చెన్నై-కోల్‌కత్తా.. అలాగే మచిలీపట్నం-హైదరాబాద్, విజయవాడ-తిరువూరు-ఖమ్మం తదితర జాతీయ రహదారులపై రాత్రి, పగలు తేడా లేకుండా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు పరుగెడుతున్నాయి. ఫ్లైఓవర్‌లు లేక అడుగుడుగునా సిగ్నల్స్ కారణంగా నిమిషాల తరబడి ఆ వాహనాలన్నీ నిలిచి పొగలు వెదజల్లుతుంటే వాటి నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్‌లు, నైట్రిక్ ఆసిడ్ ఇంకా దుమ్ము, ధూళితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పెట్రోలు, డీజిల్ కల్తీ కూడా ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఏది ఏమైనా తీవ్రస్థాయిలో వెలువడుతున్న ఈ విష వాయువుల వల్ల ప్రజల బాధలు వర్ణనాతీతం. ఇక ట్రాఫిక్‌ను నియంత్రించే పోలీస్ కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా వుంది. దాదాపు 60 శాతం మంది సిబ్బంది తరచూ ఏదో ఒక వ్యా ధితో బాధపడుతున్నట్లు సర్వే నివేదికలు పేర్కొంటున్నాయి. వారిలో కనీసం 25 శాతం మంది దగ్గు, ఛాతీనొప్పి, కీళ్లనొప్పులు, కళ్ల మంటలు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో రహదారుల వెంబడి డ్రైన్లలో రోజుల తరబడి మురుగునీరు ప్రవహిస్తుండటంతో సమస్య తీవ్రతరమవుతున్నది. కాలుష్య నివారణకు ప్రధాన రహదారుల వెంబడి ప్రభుత్వం లక్షలకు లక్షలు ఖర్చు చేసి మొక్కలను పెంచుతున్నా వాటి నిర్వహణ సక్రమంగా లేదు. దీనికితోడు ప్రతి జంక్షన్‌లో వాహనాలు కనీసం ఐదారు నిమిషాలు నిలచినప్పుడైనా ఆ కొద్దిసేపు వాహన ఇంజన్లను ఆఫ్‌చేస్తే కొంతమేరైనా కాలుష్యాన్ని అరికట్టే వీలుంటుంది.
నేడు సందర్శకులకు
మంత్రుల దర్శనం అయ్యేనా?

విజయవాడ, డిసెంబర్ 25: వా రంలో రెండు రోజల పాటు వెలగపూడిలోని సచివాలయంలో సందర్శకులకు అందుబాటులో ఉండాలని మం త్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ఆదేశించారు.
సోమ, శుక్రవారాల్లో సందర్శకులకు అందుబాటులో ఉండాలని మం త్రులను కోరారు. చాలా కాలంగా శు క్రవారాన్ని గ్రీవెన్సుడేగా ప్రకటించి, మంత్రులు సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సిఎం ఆదేశించారు. కానీ కొంతమంది మాత్రమే శుక్రవారం సచివాలయానికి వస్తున్నారు.
చా లా మంది అప్పుడప్పుడు ఆ రోజు వచ్చి వెళుతున్నారు. దీనిపై దృష్టి సా రించిన సిఎం, ఇకపై దీంతో ఇకపై వారానికి రెండు రోజులు మం త్రులు సచివాలయంలో ఉండాలని సిఎం ఆదేశించారు. దీని వల్ల సందర్శకులకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటారని సిఎం భా వన. అయితే సిఎం ప్రతిపాదన పట్ల కొంతమంది వి ముఖత వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో సచివాలయానికి సెలవు కారణంగా ఆ రెండు రోజులు సిబ్బంది అందుబాటులో ఉండరు.
అందువల్ల శుక్రవారం వచ్చి సోమవారం వరకూ నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉండటం సాధ్యం కాదని సిఎంకు మం త్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో ఇక్కడే ఉండి ఫైళ్లు, ఇతర పనులు చేసుకోవచ్చని సిఎం సూచించినా, వారంలో నాలుగు రోజులు ఇక్కడే ఉండటం సాధ్యం కాదని మంత్రులు స్పష్టం చేశారని తెలిసింది.
అయితే ప్రత్యామ్నాయంగా గురు, శుక్రవారాల్లో సచివాలయంలో సందర్శకులకు అందుబాటులో ఉం టామన్న ప్రతిపాదన చేశారు. వరుసగా రెండు రోజులు ఉండటం వల్ల సందర్శకులకు తమ పని పూర్తి చేసుకునే వీలు కూడా కలుగుతుందని సి ఎంకు వివరించినట్లు తెలిసింది. దీం తో మంత్రులు సచివాలయానికి సో మవారం వచ్చే అంశంపై స్పష్టత రా వాల్సి ఉంది.
‘సునందిని’తో పాడి పరిశ్రమాభివృద్ధి
రాయితీపై పశువుల దాణా... ఉచితంగా మందుల కిట్

విజయవాడ, డిసెంబర్ 25: రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చే స్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమను రైతులు, రైతు కూలీలకు అనుబంధ వృత్తిగా కొనసాగిస్తున్నారు. దీని ని గుర్తించిన ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోంది. ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో పాటు పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘సునందిని’ పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా ఆడ లేగ దూడల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. పశుపోషణ విధానాల్లో శాస్ర్తియత పాటించ డం, పశువుల ఉత్పాదకతను పెంచడం ద్వారా లాభసాటిగా ఉండేలా పశుపోషకుల సంక్షేమార్ధం ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకంలో పౌష్టికాహారంతో పాటు బీమా అమలు చేయడంతో పాటు మందులను పంపిణీ చేస్తుంది. కృత్రిమ గర్భాధారణ వల్ల, మేలు జాతి పశువులకు పుట్టిన 3-4 నెలల వయస్సు లేగ దూడలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతుకు చెందిన 1-2మేలు జాతి దూడలకు 4-5 నెలల వయస్సు నుంచి 2 సంవత్సరాల వరకు రాయితీతో దాణా అందిస్తారు. మం దుల కిట్టు కూడా అందజేస్తారు. దూడకు, ప్రభుత్వం బీ మా సౌకర్యం కల్పించింది. ఇందుకోసం రూ. 20 కోట్లను వెచ్చిస్తోంది. స్వయం సహాయక బృందాల మహిళా రైతులకు రెండు పాడి పశువుల పెంపకానికి స్ర్తినిధి ద్వారా వడ్డీలేని రుణంతో అందజేస్తోంది. పశు సంవర్థక శాఖ ద్వారా 75 శాతం రాయితీతో పశుదాణా ఎంపిక చేసిన లబ్ధిదారులకు అందజేస్తోంది. రాయితీతో పశుగ్రాస విత్తనాలు, ఛాఫ్ కట్టర్‌లు కూడా పంపిణీ చే స్తోంది. సునందిని పథకం అమలులో భాగంగా లేగ దూడలకు ప్రభుత్వమే 75 శాతం వరకు బీమా ప్రీమియం చెల్లిస్తుంది. మిగిలిన మొత్తం రైతు లు భరించాల్సి ఉంటుంది. సునందిని పథకం లబ్ధిదారులు పచ్చిమేత లభ్యత కోసం తమకున్న భూమిలో కొంత పశుగ్రాసం సాగు చేయాలి. సన్న, చిన్నకారు రైతులకు పశుగ్రాస సాగు నిమిత్తం ప్ర భుత్వం 75 శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలను అందజేస్తోంది. రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే ప్ర భుత్వం సునందిని పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ జి సోమశేఖర్ తెలిపారు.
జన్మభూమికి అధికారుల సమాయత్తం

విజయవాడ, డిసెంబర్ 25: జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమానికి అధికార యం త్రాం గం సమాయత్తం అవుతోంది. ప్రజల్లో ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిని మరింత ఎక్కువ చేసేందుకు వీ లుగా ఈ కార్యక్రమం రూపొందిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న వినతుల పరిష్కారం, కొత్తగా పిం ఛన్లు, రేషన్ కార్డుల జారీ సహా పింఛన్లను సకాలంలో పం పిణీ తదితర అంశాలపై అధికార య ంత్రాంగం దృష్టి సారించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని క లెక్టర్లను ఇప్పటికే సిఎం ఆదేశించారు. దీంతో పెం డింగ్‌లో ఉన్న వివిధ దరఖాస్తుల పరిష్కరించడంలో అధికారులు బిజీగా ఉన్నారు. కొత్తగా 3.5 లక్షల మందికి సామాజిక పింఛన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చా లా కాలం తరువాత 1.5 లక్షల రే షన్ కార్డులను కూడా జన్మభూమిలో జారీ చేయనున్నారు. కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులకు కూడా సం క్రాంతి కానుకలను అందచేయాలని సిఎం ఆదేశించారు. ఆర్‌బిఐ నిబంధనల కారణంగా డిసెంబర్‌లో సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా జరుగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని జనవరి లో పింఛనుదారులకు ప్రభుత్వమే నగదు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చే స్తోంది. ఇందుకు సంబంధించి నగదు నిల్వలను ముందుగానే జాగ్రత్త చేసేందుకు అధికార యంత్రాంగం ఏ ర్పాట్లు చేస్తున్నది. కొత్తగా మంజూరు చేసిన పింఛనుదారులకు కూడా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్ల కే టాయింపు, రిజిస్ట్రేషన్ తదితర అ ంశాలు కూడా జనచైతన్య యాత్రలో ప్రజలు ప్రస్తావించడంతో దానిపై కూడా జన్మభూమిలో దృష్టి సారించనున్నారు. నీరు-చెట్టు బకాయిల చెల్లించాలని ఇప్పటికే సిఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, దానికి చట్టబద్ధత, నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నరు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాల్సిన అవసరాన్ని, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు గ్రామసభలను ఉపయోగించుకోనున్నారు. ఉన్న వనరులను ఉపయోగించుకుని, అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పని చేస్తున్న ప్రభుత్వం గురించి వివరించి, ప్రభుత్వ పనీతీరు పట్ల 80 శాతం సంతృప్తి స్థాయిని సాధించేందుకు జన్మభూమిని ఒక వేదికగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

అడ్డదార్లలో కల్తీ దందా!

* ఆంధ్ర నుంచి తెలంగాణకు రెండో రకం సరుకులు
* భారీగా ఆదాయాన్ని కోల్పోతున్న రాష్ట్రం

ఖమ్మం, డిసెంబర్ 25: నిత్యావసర వస్తువుల కల్తీ నిత్యకృత్యమైంది. పట్టణాల్లోని కొందరు హోల్‌సేల్ వ్యాపారులు నాణ్యతను బట్టి ఒకటి, రెండు రకాలుగా విభజించి అమ్ముతుంటారు. ధర వ్యత్యాసం ఉండటం వల్ల చిల్లర వ్యాపారులు రెండో రకం సరుకునే కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. నాణ్యతా లోపంతో వ స్తున్న ఈ వస్తువుల్లో మరింత కల్తీ జరుగుతూ ప్రజల వద్దకు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పాత ఖమ్మం, వరంగల్, న ల్గొండ జిల్లాల్లో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గు ంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల నుంచి సరుకులు దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతం నుంచి రెండో రకం సరుకును దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాలకు ఈ సరుకు అధికంగా వస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. ప్రధాన రహదార్లపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా ఇతర ప్రాంతాల గుండా వాటిని తాము అనుకున్న పట్టణానికి చేరవేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అశ్వారావుపేట మీదుగా, తూర్పు గోదావరి జిల్లా నుంచి చింతూరు మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి రెండో రకం సరుకులు ప్రవేశిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి కంచికచర్ల, ఎర్రుపాలెం మీదుగా నందిగామ, మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోకి, జగ్గయ్యపేట, కోదాడ మీదుగా సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. కర్నూలు నుంచి వనపర్తి, గద్వాల జిల్లాలకు, గుంటూరు జిల్లా నుంచి నల్గొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు రెండో రకం సరుకు రవాణా అవుతోంది. రోడ్డుమార్గంతో పాటు ఆయా గ్రామాల వద్ద ఉన్న బల్లకట్టులు ఉపయోగించి అధిక మొత్తంలో సరుకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. పన్నులు ఎగ్గొట్టడంతో పాటు నాణ్యతా లోపంగా ఉన్న సరుకును తెలంగాణ ప్రాంతానికి తరలిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మొదటి రకం సరుకు కంటే రెండవ రకం సరుకు తక్కువకు దొరకడం, ఇక్కడకు వచ్చిన తర్వాత దానిని తిరిగి గ్రేడింగ్ చేసి మొదటి, రెండు రకాలుగా అమ్ముతుండటం విశేషం. ఉదాహరణకు వేరుశనగ నూనె మొదటి రకం 120 రూపాయలు ఉండగా 95 రూపాయలకు దొరికే రెండవ రకాన్ని దిగుమతి చేసుకొని గ్రేడింగ్ చేసి మొదటి రకం పేరుతో 120 రూపాయలకు, రెండవ రకం పేరుతో 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదే తరహాలో పంచదార 45, 40 రూపాయలకు గానూ, శనగపిండి 90, 60 రూపాయలకు గానూ విక్రయిస్తున్నారు. దీనిపై ఖమ్మం రవాణా శాఖాధికారులు ఇతర రాష్ట్రాల నుంచి రెండో రకం సరుకు రవాణా అవుతున్నట్లు సమాచారం ఉందని, అయితే ఫిర్యాదులు రావడం లేదని చెప్పడం గమనార్హం. ఇక ఆహార తనిఖీ శాఖాధికారులు తమకు లిఖిత పూర్వక ఫిర్యాదు వస్తేనే చర్యలు తీసుకుంటామని దాటవేయడం విశేషం. ఈ సమాధానాలను బట్టి అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో నకిలీ కారం, నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ ఎరువులు దొరికిన విషయం తెలిసిందే. ఇందులో కారం ఖమ్మం జిల్లా నుంచే ఇతర జిల్లాలకు వెళ్ళగా, విత్తనాలు, ఎరువులు ఆంధ్ర ప్రాంతం నుంచే కల్తీ అయి అడ్డదార్లగుండా తెలంగాణ రాష్ట్రంలోకి చేరినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా నివేదికలు అందించారు. ఒకవైపు రాష్ట్రానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయం పోతుండగా నకిలీ సరుకులతో ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. కాగా ఈ విషయంపై అధికార పార్టీ నేతలు స్పందించకపోయినా వామపక్ష పార్టీల నేతలు మాత్రం నకిలీని అరికట్టాలంటూ రాష్టవ్య్రాప్త ఆందోళనలు చేయనున్నట్లు వెల్లడించారు.