ఆంధ్రప్రదేశ్‌

చెత్తకుప్పలో కవల శిశువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 26: ఏ తల్లి చేసిన ఘోరమో అప్పుడే జన్మించిన ఇరువురు కవల శిశువులు రోడ్డు పాలయ్యారు. దిక్కుమొక్కు లేని స్థితిలో పడివున్న ముక్కుపచ్చలారని ఆడ, మగ శిశువులను స్థానికులు గమనించి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో సోమవారం వెలుగుచూసిన ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని దొండవాక గ్రామానికి చెందిన కన్నంరెడ్డి సతీష్ అనే పనసకాయల వ్యాపారి తుని పట్టణానికి వ్యాపార పనుల నిమిత్తం వచ్చారు. పట్టణంలోని మార్కెట్ యార్డుకు వచ్చిన ఆయన మూత్ర విసర్జన కోసం వెళ్ళాడు. చెత్తాచెదారాల మాటున పడివున్న ఓ మూటను గమనించాడు. అనుమానం వచ్చి గుడ్డలతో చుట్టివున్న ఆ మూటను విప్పిచూసేసరికి ఆడ, మగ కవల శిశువులు కనిపించారు. ఆ శిశువులు అరవకుండా నోట్లో కాగితాలు కుక్కినట్టు గమనించాడు. వెంటనే ఈ విషయం తెలిసి పలువురు మహిళలు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. శిశువుల నోట్లో కాగితాలను తీసివేసి, వారిని శుభ్రం చేసి, హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెనువెంటనే వైద్యులు పసికందులను వెంటిలేటర్‌లో ఉంచి, చికిత్స అందజేశారు. మగ శిశువు క్షేమంగా ఉండగా ఆడ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలోగాని ఇతర ఆసుపత్రుల్లోగాని ఎక్కడా వీరు జన్మించిన దాఖలాల్లేవని వైద్యులు గుర్తించారు. దీంతో ఈ అభాగ్యులను రహస్యంగా కని, పారేసివేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

చిత్రం..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కవల శిశువులు